Andhra news: విశాఖ నుంచే ఉచిత బస్సు పథకం ప్రారంభిస్తాం: రవాణా మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి

విశాఖ నుంచే ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తామని, త్వరలోనే మహిళలకు తీపి కబురు చెబుతామని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి తెలిపారు. 

Updated : 30 Jun 2024 20:11 IST

అమరావతి: విశాఖ నుంచే ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తామని, త్వరలోనే మహిళలకు తీపి కబురు చెబుతామని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఈ పథకం అమలు చేస్తున్న తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేస్తామన్నారు. గత వైకాపా సర్కారు ఆర్టీసీని ప్రభుత్వంలో పూర్తిగా విలీనం చేయలేదని మంత్రి విమర్శించారు. సిబ్బంది, ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా ఆర్టీసీని ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు. ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రవేశపెడతామని తెలిపారు.

‘‘రాయలసీమలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబ మాఫియా అందరికీ తెలుసు. జగన్‌ తర్వాత అత్యధిక అక్రమార్జన చేసింది ఆయనే. 1985-90 మధ్య పెద్దిరెడ్డిది సామాన్య కుటుంబం. వైకాపాకు ఆయన కుటుంబం రూ.వేల కోట్లు సమకూర్చింది. రాష్ట్రంలోని ఖనిజాలను పెద్దిరెడ్డే తవ్వేశారు. రాష్ట్రంలో 10వేల ఎకరాలు దోచేశారు. పెద్దిరెడ్డి కుటుంబం చేసిన అక్రమాలన్నీ బయటపెడతాం’’ అని మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని