Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 24 Jun 2024 20:59 IST

1. జీవన్ రెడ్డి ఇంటికి మంత్రి శ్రీధర్‌ బాబు.. భారీగా చేరుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు

రాజీనామా యోచనలో ఉన్న ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు మంత్రి శ్రీధర్ బాబు.. జగిత్యాలలోని ఆయన ఇంటికి చేరుకున్నారు. భారాస జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరడంతో జీవన్ రెడ్డి మనస్తాపానికి గురైన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. జగన్‌ మితిమీరిన భద్రతపై ఫిర్యాదులు.. ఏపీ ప్రభుత్వం ఆరా!

ఏపీ మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మితిమీరిన భద్రతపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. సీఎంగా ఉన్నప్పుడు ఎక్కడాలేని విధంగా భారీ భద్రత కల్పించుకున్నారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. సెక్యూరిటీ మాన్యువల్‌ ఉల్లంఘించారని, ప్రధానికి కూడా లేనంతగా భద్రత ఏర్పాటు చేసుకున్నారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఆ కేసు కొట్టేయండి.. హైకోర్టును ఆశ్రయించిన కేసీఆర్‌

భారాస అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ (KCR) హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో రైల్‌ రోకో సందర్భంగా తనపై నమోదైన కేసు విషయంలో ఆయన పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రజాప్రతినిధుల కోర్టులో తనపై ఉన్న కేసును కొట్టివేయాలని కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ పునరుద్ధరణ

విజయవాడ డివిజన్‌లో ఆధునికీకరణ పనుల కారణంగా రద్దు చేసిన రైళ్లలో కొన్నింటిని దక్షిణ మధ్య రైల్వే పునరుద్ధరించింది. జన్మభూమి, విజయవాడ- కాకినాడ పోర్ట్‌ రైళ్లను ప్రయాణికులకు మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చింది. నిడదవోలు-కడియం మధ్య ఆధునికీకరణ పనుల కారణంగా జూన్‌ 23 నుంచి ఆగస్టు 11 వరకు పలు రైళ్లను ఇటీవల రద్దు చేసిన సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ప్రభుత్వాన్ని కాపాడుకోవడంలోనే ప్రధాని బిజీ: రాహుల్‌ గాంధీ

ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి 15 రోజుల్లోనే పరీక్షల్లో అవకతవకలు, ఉగ్రదాడులు వంటివి చోటుచేసుకున్నాయని.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాత్రం తన ప్రభుత్వాన్ని కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అద్దెకు బ్యాంకు ఖాతాలు.. ప్రతి ₹లక్షకు రూ.1000 ఇస్తామని..

సైబర్‌ నేరగాళ్లు.. యువతకు డబ్బు ఆశ చూపి వారి బ్యాంకు ఖాతాలను అద్దెకు తీసుకుంటున్నారు. వాటితో తమ లావాదేవీలు చాకచక్యంగా సాగిస్తున్నారు. గోవా పోలీసుల దర్యాప్తులో ఈ సంచలన విషయం బయటపడింది. నిరుద్యోగులు, చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగించే యువతను వలలో వేసుకుంటున్నారని పోలీసులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. నిజ నిర్ధారణకు నాలుగు దశల్లో సీబీఐ విచారణ!

నీట్‌ యూజీ-2024, నెట్‌ (NET) పరీక్షల నిర్వహణలో అవకతవకలపై కేంద్రం ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తునకు సిద్ధమైంది. ఇప్పటికే లీకేజీకి ప్రధాన కేంద్రాలుగా అనుమానిస్తున్న బిహార్‌, గుజరాత్‌ రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపించింది. ప్రాథమిక ఆధారాలను సేకరించిన తర్వాత లోతుగా దర్యాప్తు చేపట్టనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. సరోగసీతో పిల్లల్ని పొందినా.. ఆరు నెలల మాతృత్వ సెలవులు

సరోగసీ ద్వారా మాతృత్వాన్ని పొందాలనుకునే తల్లుల కోసం కేంద్రం ఓ వెసులుబాటు తీసుకువచ్చింది. అలా సంతానాన్ని పొందిన ఉద్యోగినులకు ఆరు నెలల మాతృత్వ సెలవులు ఇవ్వనుంది. ఈ మేరకు సెంట్రల్ సివిల్ సర్వీసెస్(లీవ్‌) రూల్స్‌(1972)లో సవరణలు చేసింది. అలాగే ఆ బిడ్డ తండ్రి 15 రోజుల పితృత్వ సెలవులు తీసుకునే వీలు కల్పించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అధ్యక్ష పోరు.. చర్చకు ‘ట్రంప్‌-బైడెన్‌’ సిద్ధం

నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల నిమిత్తం అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాడీవేడీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వారిద్దరు ప్రత్యక్షంగా తలపడనున్నారు. జూన్‌ 27న మొదటిసారి వారి మధ్య చర్చ జరగనుంది. జార్జియాలోని అట్లాంటాలో 90 నిమిషాల పాటు జరగనున్న ఈ డిబేట్‌లో పలు కీలక అంశాలపై తమ వైఖరిని స్పష్టం చేయనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. దక్షిణ కొరియా బ్యాటరీ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం: 20 మంది మృతి

దక్షిణ కొరియాలోని లిథియం బ్యాటరీల కర్మాగారంలో ఘోర ప్రమాదం చోటుచేసుకొంది. ఈ ఘటనలో ఇప్పటివరకు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.30 సమయంలో సియోల్‌ దక్షిణ ప్రాంతంలోని హ్వసోంగ్‌లో ఉన్న ఆరిసెల్‌ బ్యాటరీ ప్లాంట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు