Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 21 Jan 2024 21:00 IST

1. శంషాబాద్‌ విమానాశ్రయంలో రూ.41 కోట్ల హెరాయిన్‌ పట్టివేత

శంషాబాద్‌ విమానాశ్రయంలో ఆదివారం భారీ మొత్తంలో డ్రగ్‌ పట్టుబడింది. ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి రూ.41 కోట్ల విలువ చేసే 5.92 కిలోల హెరాయిన్‌ స్వాధీనం చేసుకున్నట్టు  కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. నిందితురాలు జాంబియాకు చెందిన లుసాకాగా గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2.  ‘నేను ఎవరో వదిలిన బాణాన్ని కాదు.. స్వేచ్ఛగా పనిచేస్తా’: వైఎస్‌ షర్మిల

జనవరి 23 నుంచి జిల్లాల్లో పర్యటించనున్నట్టు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తెలిపారు. విజయవాడలోని రాష్ట్ర కాంగ్రెస్‌ కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. రోజుకు 3 జిల్లాల్లో పర్యటించి నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నట్టు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మాది సైద్ధాంతిక పోరాటం.. ఎవరికీ భయపడేది లేదు: రాహుల్‌

మణిపుర్‌లో కొన్ని నెలలుగా హింస జరుగుతున్నా.. ఇప్పటివరకూ ప్రధాని నరేంద్ర మోదీ ఆ రాష్ట్రాన్ని సందర్శించలేదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆక్షేపించారు. తమ యాత్రకు సంబంధించిన ఎన్ని పోస్టర్లను చింపేసినా పట్టించుకోమన్నారు. తాము చేస్తున్నది సైద్ధాంతిక పోరాటమని.. ఎవరికీ భయపడబోమన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఆ విషయం చెప్పించుకోవాల్సిన అవసరం మాకు లేదు: శివకుమార్‌

మతం, భక్తి గురించి ఎవరితోనో చెప్పించుకోవాల్సిన అవసరం తమకు లేదని కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీకే శివకుమార్‌ అన్నారు.  మన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను తాము ఎన్నో ఏళ్లుగా పాటిస్తున్నామని చెప్పారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక వేళ రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించకపోవడాన్ని ఆయన సమర్థించుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. బ్యాంకులో రూ.52 కోట్లు కొల్లగొట్టి.. ఆన్‌లైన్‌ గేమ్స్‌లో పెట్టి..!

కస్టమర్లు దాచుకున్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ సొమ్మును కొల్లగొట్టి, ఆన్‌లైన్‌ గేమ్స్‌ కోసం వాడుకున్న మాజీ బ్యాంకు ఉద్యోగి ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అటాచ్ చేసింది. దిల్లీలోని పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంకు ఖల్సా కళాశాల బ్రాంచ్‌లో ఉద్యోగిగా పని చేస్తున్న సమయంలో బేదాన్షు శేఖర్‌ మిశ్రా.. ఖాతాదారులు దాచుకున్న రూ.52 కోట్ల ధనాన్ని గుట్టు చప్పుడుకాకుండా దోచుకున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. 500ఏళ్ల తర్వాత దేశప్రజల కల సాకారం అవుతోంది: పవన్‌

500 ఏళ్ల తర్వాత దేశ ప్రజల సుదీర్ఘకల సాకారం అవుతోందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. రామ్‌లల్లా దర్శనం కోసం విమానంలో లఖ్‌నవూ చేరుకున్న ఆయన.. సోమవారం తెల్లవారుజామున అయోధ్యకు బయలుదేరి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో పవన్‌ మీడియాతో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. షకీలాపై పెంపుడు కుమార్తె దాడి.. పోలీసులను ఆశ్రయించిన నటి

నటి షకీలాకు చేదు అనుభవం ఎదురైంది. పెంపుడు కుమార్తె శీతల్‌ ఆమెపై దాడి చేసింది. కుటుంబ వ్యవహారాల విషయంలో మనస్పర్థలు తలెత్తడంతో శీతల్‌ నిన్న ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోయింది. చర్చించుకునేందుకు రమ్మని పిలిస్తే తన తల్లిని వెంటపెట్టుకుని వచ్చిందని.. నచ్చ జెప్పడానికి ప్రయత్నించినప్పటికీ ఆగ్రహంతో దాడికి పాల్పడిందని షకీలా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మూడు నెలలుగా వణుకుతోన్న గాజా.. 25వేలు దాటిన మరణాలు

హమాస్‌ మిలిటెంట్ల అంతమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్‌ చేస్తోన్న (Israel Hamas conflict) దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మూడున్నర నెలలుగా సాగుతోన్న ఈయుద్ధంలో ఇప్పటివరకు 25 వేల మందికిపైగా పాలస్తీనియన్లు మృతి చెందినట్లు గాజా ఆరోగ్య విభాగం (Gaza) వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. టెస్టు క్రికెట్‌ కోసం 3 నెలలు వదిలేయాలి: మైకెల్ వాన్‌

టెస్టు క్రికెట్‌ (Test Cricket) ప్రమాదంలో పడిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన చర్యలపై ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్ మైకెల్‌ వాన్ సూచనలిచ్చారు. ‘‘ఏడాదిలో మూడు నెలల సమయం టెస్టుల కోసం వదిలేయాలి. పురుషుల, మహిళా క్రికెట్‌లో ఇలాంటి విధానం తీసుకురావాలి. అప్పుడే టెస్టు క్రికెట్‌ను బతికించుకొనే అవకాశం ఉంటుంది’అని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. రష్యా గ్యాస్‌ ఎగుమతి టెర్మినల్‌లో భారీ పేలుడు

రష్యాలోని సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ (St Petersburg) నగరం సమీపంలో భారీ పేలుడు (Explosion) సంభవించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న గ్యాస్‌ ఎగుమతి టెర్మినల్‌లో (Gas Exporting terminal) ఈ ఘటన చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఆస్తి, ప్రాణ నష్టంపై ఇప్పటి వరకు స్పష్టమైన సమాచారం లేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని