Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 27 Oct 2023 13:25 IST

1. సున్నా వడ్డీ.. లాభమేనా?

పండగల నేపథ్యంలో ఇ-కామర్స్‌ వెబ్‌సైట్లు, షోరూముల్లో ఎక్కడ చూసినా రాయితీలే కనిపిస్తున్నాయి. గృహోపకరణాలు, ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ఇలా ఏది కొనాలన్నా సున్నా శాతం వడ్డీ (నో కాస్ట్‌ ఈఎంఐ)తో వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు ఉంటోంది. ఒక వస్తువును కొనాలనుకున్న చాలామంది ఈ నో కాస్ట్‌ ఈఎంఐనే ఎంచుకుంటున్నారు. దీన్ని ఎంచుకుంటే నిజంగా ఎలాంటి వడ్డీ భారం ఉండదా? తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలేమిటో చూద్దాం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. చారిత్రక కోట.. బోథ్‌ అడ్డా!

బోథ్‌ అసెంబ్లీ నియోజకవర్గం 1962లో ఏర్పడింది. ఇప్పటి వరకు 13 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. మొదట్లో జనరల్‌గా ఉన్న ఈ స్థానాన్ని 1967 నుంచి గిరిజనులకు(ఎస్టీ) రిజర్వ్‌ చేశారు. నియోజకవర్గంలో బోథ్‌, నేరడిగొండ, బజార్‌హత్నూర్‌, ఇచ్చోడ, గుడిహత్నూర్‌, తాంసి, తలమడుగు, సిరికొండ, భీంపూర్‌ మండలాలు ఉన్నాయి. ఇటీవల సొనాలను నూతన మండలంగా ఏర్పాటు చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. భిన్నత్వంలో ఏకత్వం.. ఆదిలాబాద్‌ ప్రత్యేకం

గుజరాతీల దాండియా ఆటలు.. మార్వాడీల పండగలు.. ఆదివాసీల గుస్సాడీ నృత్యాలు.. లంబాడీల తీజ్‌ ఉత్సవాలు.. తెలుగింటి బతుకమ్మ సంబరాలు ఆదిలాబాద్‌లో కనిపిస్తాయి. బిహార్‌, అసోం, ఒడిశా రాష్ట్రాలవాసులు ఇక్కడి వారితో కలిసిపోయి పని చేసుకుంటారు. మొత్తానికి మినీ భారత్‌గా ఆదిలాబాద్‌ ప్రసిద్ధికెక్కింది. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతోంది.  నియోజకవర్గం ఆదిలాబాద్‌, బేల, జైనథ్‌, మావల మండలాలు, ఆదిలాబాద్‌ పట్టణ ప్రాంతంతో కలిసి ఉంటుంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. వైకల్యమా.. బ్రో.. ఉయ్‌ డోంట్‌ కేర్‌

వీరిద్దరు దివ్యాంగులు.. అయితేనేం  ఆత్మస్థైర్యంతో విధిని జయించారు.. ఆటల్లో చక్కగా రాణిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో గుజరాత్‌లో జరిగిన జాతీయ జూనియర్‌ పారా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో బంగారు పతకాలు సాధించి ప్రశంసలు అందుకున్నారు. హరియాణాకు చెందిన   జ్యోతికి పుట్టుకతోనే అంగవైకల్యం. కృత్రిమ కాలు ధరించి క్రీడల్లో పాల్గొంటోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. పీలిస్తే రో‘గాలే’!

పెరుగుతున్న వాహనాలు, పరిశ్రమల కారణంగా రాష్ట్రంలో వాయు కాలుష్యం పెరుగుతుండగా.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు తీవ్రతను మరింత పెంచుతున్నాయి. కొద్ది రోజులుగా చలి పెరుగుతుండటంతో గాలి నాణ్యత క్రమంగా క్షీణిస్తుండగా, కనిష్ఠ ఉష్రోగ్రతలు నమోదైన సమయాల్లో నాణ్యత సూచి స్వచ్ఛం నుంచి మధ్యస్థస్థాయికి పడిపోతోంది. ఈ పరిస్థితుల్లో కాలుష్య ప్రభావిత ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. 28, 29 తేదీల్లో పాక్షిక చంద్ర గ్రహణం

దేశంలో ఈ ఏడాది కనిపించే ఏకైక చంద్ర గ్రహణం ఈ నెల 28, 29 తేదీల్లో ఏర్పడుతుందని ప్లానెటరీ సొసైటీ ఇండియా డైరెక్టర్‌ రఘునందన్‌కుమార్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇది పాక్షిక గ్రహణమని.. 28న రాత్రి 11:30 గంటలకు ప్రారంభమై, 29న తెల్లవారుజామున 3:58 నిమిషాలకు ముగుస్తుందన్నారు. అర్ధరాత్రి 1:05 నుంచి 2:23 వరకు మాత్రమే కంటికి కనిపిస్తుందని వివరించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ప్రచార భోజనంబు

‘‘వివాహ భోజనంబు... వింతైన వంటకంబు...’’ విశేష ప్రజాదరణ పొందిన ఈ పాట కాస్త మారింది.   ‘‘ప్రచార భోజనంబు... తింటుంటే కమ్మగుండు.. ఈ ఒక్కరోజే కాదు.. ఇది ఎన్నికల పుణ్యంబు...’’ అంటూ వివిధ పార్టీల కార్యకర్తలు, నాయకులు లొట్టలేస్తున్నారు. అంతేకాదు... ఎన్నికల పుణ్యమాని గరిటె తిప్పే వంట మేస్త్రీలకు, కేటరింగ్‌ బృందాలకు మస్తు గిరాకీ దొరుకుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఆటగాళ్లను అర్థం చేసుకోవడం కీలకం

జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడు చెప్పేది వినడం.. వారిని అర్థం చేసుకోవడం చాలా కీలకమని భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ రోహిత్‌శర్మ అన్నాడు. వన్డే ప్రపంచకప్‌లో రోహిత్‌ సారథ్యంపై ప్రశంసలు కురుస్తున్నాయి. నాయకుడి పాత్రను సమర్థంగా పోషిస్తూ జట్టులోని ప్రతి ఒక్కరి నుంచి మంచి ఫలితాలు రాబడుతున్నాడు. ‘‘ఆటగాళ్ల నిర్వహణ విషయంలో వ్యక్తిగతంగా ఒకొక్కరిని అర్థం చేసుకోవడం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఈ చాయ్‌వాలా అదృష్టం ఎలా ఉందో!

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ నగరంలో టీకొట్టు నడుపుతూ జీవనం సాగిస్తున్న ఆనంద్‌సింగ్‌ కుశ్వాహా 28వ ప్రయత్నంగా తాజా ఎన్నికల్లో తన నామినేషను వేశారు. 1994 మొదలు పురపాలక, లోక్‌సభ, అసెంబ్లీ.. ఇలా ప్రతి ఎన్నికలోనూ బరిలోకి దిగుతున్న ఈయన ప్రస్తుత పోటీలో బీఎస్పీ అభ్యర్థిగా గ్వాలియర్‌ తూర్పు నియోజకవర్గం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. బందరు అబ్బాయి.. జపాన్‌ అమ్మాయి

మనసులు కలిశాక ఒక ఇంటివారవడానికి కుల, మతాలు అడ్డుకావని నిరూపిస్తున్నారు ఈ జంట. మచిలీపట్నంకు చెందిన న్యాయవాది యక్కల ఉమా సుందర వీర వెంకట సుబ్బారావు, పద్మావతి దంపతుల చిన్న కుమారుడు సుందర మణికంఠ దినకర్‌ అమెరికాలోని కాలిఫోర్నియాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. అక్కడే పనిచేస్తున్న జపాన్‌కు చెందిన ఎమీ షినోకితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని