Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 30 Jun 2024 16:59 IST

1. డీఎస్‌ కుటుంబానికి కాంగ్రెస్‌ అండగా ఉంటుంది: సీఎం రేవంత్‌రెడ్డి

కాంగ్రెస్‌ పార్టీకి డి.శ్రీనివాస్‌ (డీఎస్‌) ఎంతో సేవ చేశారని.. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్‌లో డీఎస్‌ భౌతికకాయం వద్ద ఆయన నివాళులర్పించి కుటుంబసభ్యులను ఓదార్చారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. వినతుల స్వీకరణకు టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు: తెదేపా ఏపీ అధ్యక్షుడు పల్లా

ప్రజల నుంచి వినతుల స్వీకరణకు కొత్తగా టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెదేపా ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలు వారి సమస్యలను 73062 99999 నంబర్‌కు ఫోన్‌ చేసి తెలియజేస్తే.. ప్రాధాన్యతను బట్టి సీఎంను కలిసే అవకాశం కల్పిస్తామని తెలిపారు. ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. విశాఖ నుంచే ఉచిత బస్సు పథకం ప్రారంభిస్తాం: రవాణా మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి

విశాఖ నుంచే ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తామని, త్వరలోనే మహిళలకు తీపి కబురు చెబుతామని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఈ పథకం అమలు చేస్తున్న తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేస్తామన్నారు. గత వైకాపా సర్కారు ఆర్టీసీని ప్రభుత్వంలో పూర్తిగా విలీనం చేయలేదని మంత్రి విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ప్రశ్నించే విద్యార్థులు, నిరుద్యోగులపై కేసులా?: హరీశ్‌రావు

 కాంగ్రెస్‌ ప్రభుత్వంలో బల్మూరి వెంకట్‌, తీన్మార్‌ మల్లన్నకు ఉద్యోగాలు వచ్చాయని.. ధర్నాలు చేస్తున్న గ్రూప్స్‌ అభ్యర్థులకు మాత్రం రాలేదని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ప్రజా పాలనలో విద్యార్థులు, నిరుద్యోగులను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. తితిదే ఈవో ఆగ్రహం.. అందుబాటులోకి గత పాలకమండలి తీర్మానాలు

తితిదే పాలనలో పారదర్శకత తీసుకొచ్చేందుకు ఈవో శ్యామలరావు చర్యలు చేపట్టారు. గత పాలకమండలి తీర్మానాలను అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టించారు. 2023 ఆగస్టు నుంచి 2024 మార్చి వరకు మొత్తం 8 బోర్డు సమావేశాలు జరిగాయి. అప్పుడు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచడంపై ఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ‘అమ్మ పేరుతో ఒక మొక్క’.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు

‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ పునఃప్రారంభించారు. వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి రేడియో ప్రసంగం చేశారు. ‘‘ఏక్‌ పేడ్‌ మా కే నామ్‌’’ పేరుతో తీసుకొచ్చిన కొత్త ప్రచారం గురించి ప్రస్తావించారు. ‘‘మా అమ్మ పేరుతో నేను మొక్క నాటాను. ప్రతి ఒక్కరూ తమ తల్లులను గౌరవించేలా ఒక మొక్కను నాటండి’’ అని పిలుపునిచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. విరాట్ కోహ్లీ ఐసీసీ టైటిల్స్‌ రికార్డు.. ధోనీకి కూడా సాధ్యం కాలేదు!

టీ20 ప్రపంచకప్‌ గెలవడంతో నాలుగు ఐసీసీ టైటిల్స్‌ అందుకున్న రెండో భారత క్రికెటర్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. అండర్-19 వరల్డ్ కప్‌ (2008), వన్డే ప్రపంచ కప్‌ (2011), ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ (2013), టీ20 ప్రపంచ కప్‌ (2024) కోహ్లీ ఖాతాలో ఉన్నాయి. టీమ్‌ఇండియాకు సుదీర్ఘకాలంపాటు కెప్టెన్‌గా ఉన్న మహేంద్రసింగ్ ధోనీకి ఈ రికార్డు సాధ్యం కాలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. దేశ అత్యున్నత అధికారులుగా..చిన్ననాటి స్నేహితులు

బాల్య స్నేహితులిద్దరు దేశ రక్షణదళాల అత్యున్నత కమాండర్లుగా మారారు. వీరు మరెవరో కాదు దేశంలోని ఆర్మీ(Army), నేవీ(Navy) అధిపతులు. అడ్మిరల్ దినేష్ త్రిపాఠి భారత నౌకాదళ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా లెఫ్టినెంట్ జనరల్ ద్వివేది ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఉత్కంఠ రేకెత్తించిన మ్యాచ్‌లో బెస్ట్‌ ఫీల్డర్‌ ఎవరంటే..

ఉత్కంఠ రేకెత్తిన టీ20 ప్రపంచ కప్‌ తుది మ్యాచ్‌లో ఎట్టకేలకు విజయం భారత్‌ వశమైంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌.. ఇలా అన్ని విభాగాల్లో ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. మరి ఇలాంటి చరిత్రాత్మక మ్యాచ్‌లో ఉత్తమ ఫీల్డర్‌ ఎవరై ఉంటారు ఇంకెవరు.. చరిత్రలో నిలిచిపోయే క్యాచ్‌తో జట్టు విజయాన్ని ఖాయం చేసిన మన సూర్య కుమార్‌ యాదవే.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. చనిపోయాక ‘గేట్స్‌’కు విరాళాలు ఉండవు - వారెన్‌ బఫెట్‌

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన వారెన్‌ బఫెట్‌ బిల్‌గేట్స్‌ ఫౌండేషన్‌కు పెద్ద మొత్తంలో విరాళాలు ఇస్తూ వస్తున్నారు. ఇటీవల కూడా రూ.కోట్ల విలువైన షేర్లను కేటాయించారు. అయితే, తాను చనిపోయిన తర్వాత ఆ విరాళాలు ఉండవని చెప్పారు. వాటిని తన ముగ్గురు కుమారులు నిర్వహిస్తారని.. ఇందుకు సంబంధించి వీలునామాలో మార్పులు చేసినట్లు తాజా నివేదిక వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని