Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 29 Jun 2024 17:03 IST

1. పులివెందుల కౌన్సిలర్ల అసమ్మతి.. పార్టీలోనే ఉండాలని ఎంపీ అవినాశ్‌ సూచన

పులివెందులలోని మున్సిపల్‌ కౌన్సిలర్లతో వైకాపా ఎంపీ అవినాశ్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. గత కొంత కాలంగా కౌన్సిలర్లు పార్టీపై అసమ్మతితో ఉన్నారనే సమాచారంతో ఆయన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.  పూర్తి కథనం

2. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో సీఎం రేవంత్‌ పర్యటన

సీఎం రేవంత్‌రెడ్డి ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పర్యటిస్తున్నారు. గీసుకొండ మండలం శాయంపేటకు చేరుకున్న ఆయనకు జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్క స్వాగతం పలికారు. వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్క్‌ నిర్మాణ పనుల పురోగతిని సీఎం పరిశీలించారు. పూర్తి కథనం

3. విజయవాడ-జగదల్‌పూర్‌ హైవేలో మార్పులు కోరాం: మంత్రి తుమ్మల

విజయవాడ-జగదల్‌పూర్‌ హైవే విషయంలో కొన్ని మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రహదారుల నిర్మాణంలో కేంద్రానికి పలు ప్రతిపాదనలు పెట్టినట్లు చెప్పారు. పూర్తి కథనం

4. అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్‌ భవనాలను నోటిఫై చేస్తూ గెజిట్‌ జారీ

అమరావతి ప్రాంతంలో చేపట్టనున్న ప్రభుత్వ కాంప్లెక్స్‌ భవనాలను నోటిఫై చేస్తూ గెజిట్‌ జారీ చేశారు. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం అమరావతిలో ప్రభుత్వ కాంప్లెక్స్‌ భవనాలు నిర్మించనున్నారు. ప్రభుత్వ కాంప్లెక్స్‌ ప్రాంతమైన 1575 ఎకరాల ప్రాంతాన్ని సీఆర్డీఏ నోటిఫై చేసింది. పూర్తి కథనం

5. ఆ విషయం చెప్పడానికి మేం సిగ్గుపడం: కత్రినా ప్రెగ్నెన్సీ రూమర్స్‌పై విక్కీ

బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌ ప్రెగ్నెంట్‌ అంటూ కొన్ని రోజులుగా వస్తోన్న వార్తలపై ఆమె భర్త విక్కీ కౌశల్‌ (Vicky Kaushal) స్పందించారు. తన కొత్త చిత్రం ప్రమోషన్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ రూమర్‌ గురించి మాట్లాడారు.  పూర్తి కథనం

6. మోదీని పెళ్లికి ఆహ్వానించిన వరలక్ష్మీ శరత్ కుమార్‌.. థ్యాంక్స్‌ చెబుతూ పోస్ట్‌

ప్రధాని మోదీని పెళ్లికి ఆహ్వానించారు నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. గత కొన్ని రోజులుగా వరలక్ష్మి టాలీవుడ్‌, కోలీవుడ్‌ ప్రముఖులను తన పెళ్లికి ఆహ్వానిస్తున్నారు. పూర్తి కథనం

7. రసాయన పరిశ్రమలో పేలిన రియాక్టర్‌.. వాహనాలు దగ్ధం

శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరంలోని రసాయన పరిశ్రమలో పేలుడు సంభవించింది. సరకా ల్యాబొరేటరీస్‌లో రియాక్టర్‌ పేలడంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.  పూర్తి కథనం

8. రోహిత్‌ శర్మ ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు: జస్‌ప్రీత్ బుమ్రా

టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2024) భారత్‌ ఫైనల్‌కు చేరడంలో జస్‌ప్రీత్ బుమ్రా కీలక పాత్ర పోషించాడు. ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి తీసుకొచ్చి పరుగులు నియంత్రించడంతోపాటు కీలక సమయంలో వికెట్లు తీశాడు. పూర్తి కథనం

9. జియో, ఎయిర్‌టెల్‌ బాటలోనే వీఐ.. టారిఫ్‌ల పెంపు

రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌ బాటలోనే వొడాఫోన్‌ ఐడియా (Vodafone Idea) సైతం తమ మొబైల్‌ సేవల టారిఫ్‌లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రీపెయిడ్‌, పోస్ట్‌ పెయిడ్‌ మొబైల్‌ టారిఫ్‌లను 11-24 శాతం వరకు పెంచుతున్నట్లు తెలిపింది. జులై 4 నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి.  పూర్తి కథనం

10. కాలుకు గాయం.. బాలుడి మర్మావయవాలకు సర్జరీ!

కాలుకు గాయమైన తొమ్మిదేళ్ల బాలుడ్ని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చగా.. అక్కడి వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. గాయమైన చోట కాకుండా బాలుడి మర్మావయవాలకు శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని (Maharashtra) ఠాణె (Thane) జిల్లా శహాపుర్‌లో చోటు చేసుకుంది. పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని