Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...   

Published : 26 Jun 2024 16:59 IST

1. మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు సరికాదని చెప్పినా భారాస ప్రభుత్వం పట్టించుకోలేదు: కోదండరాం

మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు కట్టడం మంచిది కాదని చెప్పినా భారాస ప్రభుత్వం పట్టించుకోలేదని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్ట్ రీ ఇంజినీరింగ్‌కు ముందు డాక్టర్ బి.ఆర్‌.అంబేడ్కర్ సుజల స్రవంతి పేరుతో ప్రారంభించారు. మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు సరికాదని చెప్పినా భారాస ప్రభుత్వం ప్రాజెక్ట్ నిర్మాణానికి సిద్ధమైంది. పూర్తి కథనం

2. ప్రజలకు ముఖం చూపించుకోలేక జగన్‌ కుయుక్తులు: ఎమ్మెల్యే మాధవీరెడ్డి

ప్రతిపక్ష హోదా కోసం వైకాపా అధ్యక్షుడు జగన్ స్పీకర్‌కు లేఖ రాయడం సిగ్గుచేటని తెదేపా ఎమ్మెల్యే ఆర్.మాధవీరెడ్డి ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కనీస అవగాహన లేకుండా జగన్ ప్రతిపక్ష హోదా కోరడం హేయమైన చర్య అన్నారు.  పూర్తి కథనం

3. జూడాల సమ్మె తాత్కాలిక విరమణ.. రెండు జీవోలు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

జూనియర్‌ డాక్టర్లకు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ప్రభుత్వం రెండు జీవోలను జారీ చేసింది. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల జూడాల వసతిగృహాల నిర్మాణానికి జీవో విడుదల చేసింది. కాకతీయ వైద్య కళాశాలలో రహదారుల పునరుద్ధరణకు నిధులు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులతో పాటు కాకతీయ వర్సిటీకి రూ.204.85 కోట్లు కేటాయించింది. పూర్తి కథనం

4. ఈరోజుల్లో ఎంతమంది హీరోయిన్లు దీనికి సిద్ధంగా ఉన్నారు?: పరిణీతి చోప్రా

ఇటీవల విడుదలైన ‘అమర్‌ సింగ్‌ చంకీల’తో విజయాన్ని అందుకున్నారు బాలీవుడ్‌ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra). ఈ సినిమా కోసం ఆమె 16 కిలోల బరువు పెరిగారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీని గురించి ప్రస్తావిస్తూ.. ఎంతమంది హీరోయిన్లు ఇలా బరువు పెరగడానికి సిద్ధంగా ఉన్నారని ప్రశ్నించారు. పూర్తి కథనం

5. మీ ఆంతర్యం ఏంటి..? బ్రాడ్‌కాస్టర్‌పై సునీల్ గావస్కర్‌ తీవ్ర ఆగ్రహం!

ఆస్ట్రేలియాపై భారీ ఇన్నింగ్స్‌ ఆడిన భారత కెప్టెన్ రోహిత్ శర్మపై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. కేవలం 41 బంతుల్లోనే 92 పరుగులు చేసి స్టార్క్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయి పెవిలియన్‌కు చేరాడు. ఆ సమయంలో టీ20 ప్రపంచకప్‌ అధికారిక బ్రాడ్ కాస్టర్‌ స్టార్ స్పోర్ట్స్‌ ఓ గ్రాఫిక్‌ను పదేపదే చూపిస్తూ.. ఎడమచేతి వాటం పేసర్ల బౌలింగ్‌లో రోహిత్ ఔటైనట్లు పేర్కొంది.  పూర్తి కథనం

6. రెండ్రోజులకే ముగిసిన స్పెక్ట్రమ్‌ వేలం.. ఈసారి ఆదరణ అంతంతే..!

మొబైల్‌ వాయిస్‌ కాల్స్‌, డేటా కోసం కేంద్రం నిర్వహించిన టెలికాం స్పెక్ట్రమ్‌ వేలం (Spectrum auction) ముగిసింది. మొత్తం రూ.96,238 కోట్ల విలువైన 10 GHZ స్పెక్ట్రమ్‌ను వేలానికి ఉంచగా.. కేవలం రెండ్రోజుల్లోనే వేలం ముగిసింది. 12 శాతం స్పెక్ట్రానికి మాత్రమే బిడ్డింగులు వచ్చాయి. పూర్తి కథనం

7. రోడ్లు సరిగా లేకపోతే.. టోల్‌ వసూలు చేయొద్దు: గడ్కరీ

టోల్‌ ఛార్జీల వసూలు గురించి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. రోడ్లు సరిగా నిర్వహించలేనప్పుడు టోల్‌ వసూలు చేయొద్దని ఆయా ఏజెన్సీలకు సూచించారు. గుంతలతో కూడిన రోడ్లు, టోల్‌ ప్లాజాల వద్ద రద్దీ.. ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు.   పూర్తి కథనం

8. తొలి ప్రసంగంలో ‘ఎమర్జెన్సీ’పై స్పీకర్‌ వ్యాఖ్యలు.. మోదీ ఏమన్నారంటే..?

లోక్‌సభ స్పీకర్‌గా వరుసగా రెండోసారి ఎన్నికైన ఓం బిర్లా (Om Birla) సభలో తొలి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘ఎమర్జెన్సీ (Emergency)’ అంశాన్ని ప్రస్తావించారు. అత్యయిక స్థితి నాటి విషాదాన్ని గుర్తుచేసుకుంటూ సభలో మౌనం పాటించారు. అయితే, స్పీకర్‌ ప్రసంగంపై కాంగ్రెస్‌ సహా విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. పూర్తి కథనం

9. అధికారులకు చెంపపెట్టు.. చేయి చేయి కలిపి స్వయంగా రోడ్డు బాగు చేసుకొని!

కనీస మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన నగరపాలక సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. నిధులు లేవనే సాకుతో ముఖం చాటేసింది. పలుమార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ స్పందించకపోవడంతో విసుగెత్తిపోయిన విద్యార్థులు, ఉద్యోగులు, ఐటీ నిపుణులు.. స్వయంగా రంగంలోకి దిగారు.  పూర్తి కథనం

10.  ట్రంప్‌-బైడెన్‌ ‘డిబేట్‌’.. కోట్లాది అమెరికన్లలో ఉత్కంఠ!

నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలపై యావత్‌ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇందుకోసం అక్కడ వాడీవేడి ప్రచారం కొనసాగుతోంది. ఈ క్రమంలో అధ్యక్షుడు జో బైడెన్‌, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌లు ప్రత్యక్ష చర్చకు సిద్ధమయ్యారు.  పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని