Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 04 Jul 2024 17:02 IST

1. విభజన సమస్యల పరిష్కారం కోసం కేంద్ర హోంశాఖ చొరవ తీసుకోవాలి: సీఎం రేవంత్‌

తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీని కోరామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రధాని, హోం మంత్రి అమిత్‌ షాతో భేటీ అనంతరం సీఎం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. పూర్తి కథనం

2. దిల్లీ, హరియాణాల్లో వారితో పొత్తు లేనట్లే...! కాంగ్రెస్‌

కాంగ్రెస్‌ (Congress) నేతృత్వంలో ప్రతిపక్షాలు ‘ఇండియా’ కూటమి (INDIA Bloc)గా ఏర్పడి ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు సాధించాయి. ఇదే ఉత్సాహంతో త్వరలో జరగనున్న ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు సన్నద్ధమవుతున్నాయి. పూర్తి కథనం

3. పిన్నెల్లిని పరామర్శించడానికి జగన్‌ చేసిన ఖర్చు రూ.25 లక్షలు: హోంమంత్రి అనిత

ఈవీఏం పగులగొట్టి జైలుకెళ్లిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి మాజీ సీఎం జగన్‌ రూ.25 లక్షలు ఖర్చు చేశారని హోంమంత్రి అనిత ఆరోపించారు. పిన్నెల్లిని కలిసేందుకు ఆయన హెలికాప్టర్‌లో నెల్లూరు జైలుకు వెళ్లారని చెప్పారు. పూర్తి కథనం

4. హైదరాబాద్‌-అమరావతి హైవేపై కేంద్రమంత్రి గడ్కరీతో చర్చించిన సీఎం చంద్రబాబు

దిల్లీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో సమావేశం తర్వాత కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పలు హైవేల నిర్మాణంపై చర్చించారు. పూర్తి కథనం

5. ఇంటర్నేషనల్‌ అవార్డు సొంతం చేసుకున్న ధనుష్‌ చిత్రం

ధనుష్‌ హీరోగా అరుణ్‌ మాథేశ్వరన్‌ తెరకెక్కించిన సినిమా ‘కెప్టెన్‌ మిల్లర్‌’ (Captain Miller). ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది. ఇందులో ధనుష్‌ నటనకు విమర్శకులు కూడా ప్రశంసలు కురిపించారు.  పూర్తి కథనం

6. శరవేగంగా ‘విశ్వంభర’.. లేటెస్ట్‌ అప్‌డేట్‌ ఇదే!

చిరంజీవి కథానాయకుడిగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ (Vishwambhara). ఈ సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా దీనిపై నిర్మాణసంస్థ ఓ అప్‌డేట్‌ షేర్‌ చేసింది. సినిమా డబ్బింగ్‌ వర్క్‌ మొదలైనట్లు తెలిపింది. పూర్తి కథనం

7. మొన్న ఆర్మీ ట్రైనింగ్‌.. ఇప్పుడు పాత పరుపులపై ప్రాక్టీస్.. పాక్‌పై ట్రోలింగ్‌

ఆర్మీ తరహా ట్రైనింగ్‌తో పాకిస్థాన్‌ ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup 2024) కోసం సిద్ధమయ్యారు. ట్రెక్కింగ్‌ చేయడం, అడవుల్లో, నదుల్లో నడుస్తూ సాధన చేశారు. తీరా, పొట్టి కప్‌ గ్రూప్‌ స్టేజ్‌లోనే ఇంటిముఖం పట్టిన పాక్‌ తీవ్ర విమర్శలపాలైంది.   పూర్తి కథనం

8. 8 నెలల గరిష్ఠానికి నిరుద్యోగ రేటు.. వెల్లడించిన సీఎంఐఈ

 ఉపాధి అవకాశాలు లభించకపోవడంతో భారత్‌లో నిరుద్యోగ రేటు పెరిగింది. మేలో 7శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు జూన్‌లో 9.2 శాతానికి చేరింది. ఇది 8 నెలల గరిష్ఠం అని ‘సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (CMIE)’ విడుదల చేసిన వినియోగదారుల పిరమిడ్ల గృహసర్వేలో బహిర్గతమైంది. పూర్తి కథనం

9. ప్రచారంలో సవాలు విసిరి.. మంత్రి పదవికి రాజీనామా చేసి..!

భాజపా సీనియర్‌ నేత, రాజస్థాన్ (Rajasthan) మంత్రి కిరోడి లాల్‌ మీనా (Kirodi Lal Meena) కీలక నిర్ణయం తీసుకున్నారు. తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన బాధ్యత వహించిన స్థానాల్లో కాషాయ పార్టీ ఓడిపోవడమే అందుకు కారణం. పూర్తి కథనం

10. ‘వాస్తవాధీన రేఖ’ను గౌరవించాల్సిందే - చైనాకు జైశంకర్‌ స్పష్టం

వాస్తవాధీన రేఖ (LAC)ను గౌరవించడంతోపాటు సరిహద్దులో శాంతిని నెలకొల్పేందుకు కృషి చేయాల్సిందేనని భారత విదేశాంగశాఖ చైనాకు స్పష్టంచేసింది. వీటితోపాటు సరిహద్దులో నెలకొన్న ఇతర సమస్యలను వీలైనంత తొందరగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని