Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...   

Published : 03 Jul 2024 16:59 IST

1. ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలన్నీ తప్పకుండా అమలు చేస్తాం: భట్టి

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రూ.లక్ష రుణమాఫీ చేస్తామని ఐదేళ్లు కాలయాపన చేసిన భారాస నేతలు మమ్మల్ని రుణమాఫీ ఎప్పుడు చేస్తారని  ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. పూర్తి కథనం

2. ఉప్పాడ తీరాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ మూడో రోజు కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు. వాకతిప్ప ఫిషింగ్‌ హార్బర్‌, సూరప్ప తాగునీటి చెరువుతో పాటు ఉప్పాడలో కోతకు గురైన తీరప్రాంతాన్ని పవన్‌ పరిశీలించారు.  పూర్తి కథనం

3. రామ్‌ చరణ్‌ దంపతుల మాటతో నా సంతోషం వెయ్యి రెట్లు పెరిగింది: జానీ మాస్టర్‌

రామ్ చరణ్‌ దంపతులు ఇచ్చిన మాటతో తన సంతోషం వెయ్యి రెట్లైందన్నారు ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌. డ్యాన్సర్స్‌ యూనియన్‌లోని కుటుంబాలకు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ విషయంలో సాయం చేస్తామని మాటిచ్చినట్లు తెలిపారు. దీనిపై ఆయన ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. పూర్తి కథనం

4. ఫైనల్‌ను చివరివరకూ చూశా.. భారత్‌ బ్రాండ్‌ క్రికెట్‌ అద్భుతం: పాక్‌ పేసర్

టీ20 ప్రపంచ కప్‌ ఫైనల్‌లో (T20 World Cup 2024) దక్షిణాఫ్రికాను ఓడించిన భారత్ రెండోసారి విజేతగా నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌ను సఫారీ జట్టుపై ఏడు పరుగుల తేడాతో గెలిచింది. పొట్టి కప్‌ ఫైనల్‌లో టీమ్‌ఇండియా అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించిందని పాకిస్థాన్‌ స్టార్ పేసర్ షహీన్ అఫ్రిది ప్రశంసలు కురిపించాడు. పూర్తి కథనం

5. సరికొత్త గరిష్ఠాలకు సూచీలు.. సెన్సెక్స్‌ 80 వేలు తాకి వెనక్కి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మరోసారి సరికొత్త రికార్డులను తిరగరాశాయి. సెన్సెక్స్‌ తొలిసారి 80వేల మార్కును అందుకుంది. ఇంట్రాడేలో 80,074 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాలను తాకి కాస్త క్షీణించి 80వేల మార్కు దిగువన ముగిసింది. నిఫ్టీ సైతం 24,307 పాయింట్ల వద్ద సరికొత్త గరిష్ఠాలను నమోదు చేసింది.  పూర్తి కథనం

6. దేశీయ సోషల్‌ మీడియా ‘కూ’ యాప్‌ మూత!

దేశీయ సోషల్‌ మీడియా యాప్‌.. కూ (Koo app) మూత పడింది. ఎక్స్‌ (ట్విటర్‌కు)కు ప్రత్యామ్నాయంగా మారుతుందని అనిపించిన ఈ సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌ తన కార్యకలాపాలను తాజాగా నిలిపివేసింది. సంస్థ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ ఈ మేరకు లింక్డిన్‌లో బుధవారం పోస్ట్‌ చేశారు. పూర్తి కథనం

7. మణిపుర్‌పై రాజకీయాలు ఆపండి: విపక్షాలపై మోదీ ధ్వజం

‘మణిపుర్‌’ అంశం (Manipur Issue)పై పార్లమెంట్‌లో చర్చ జరపాలంటూ విపక్షాలు డిమాండ్‌ చేస్తోన్న వేళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) దీనిపై స్పందించారు. ఆ ఈశాన్య రాష్ట్రంలో శాంతి స్థాపనకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. దీనిపై రాజకీయాలు చేయొద్దంటూ విపక్షాలకు హితవు పలికారు.  పూర్తి కథనం

8. ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కె.కేశవరావు

సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. బుధవారం దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. కేశవరావుకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్‌ మున్షీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.   పూర్తి కథనం

9. ‘ఆమె’ కలలకు తాలిబన్ల సంకెళ్లు..!

అఫ్గానిస్థాన్‌ (Afghanistan)ను చేజిక్కించుకున్న తాలిబన్లు (Taliban).. అక్కడి మహిళల హక్కులను కాలరాస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తూనే ఉన్నాయి. కఠిన ఆంక్షలు విధిస్తూ, అడుగడుగునా వారి అభ్యున్నతికి అడ్డంకిగా మారినట్లు చెబుతున్నాయి. బాలికలను చదువు నుంచి దూరం చేసి వంటింటికే పరిమితం చేయడంపై ఐరాస వంటి అంతర్జాతీయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పూర్తి కథనం

10. జగన్ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన విజయవాడ ఆటోనగర్

గత ఐదేళ్ల జగన్ పాలనలో విజయవాడ ఆటోనగర్ తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. వైకాపా నేతల అలసత్వంతో పారిశ్రామికవాడ పరిస్థితి ఘోరంగా దిగజారింది. అస్తవ్యస్తమైన రహదార్లు, పూడుకుపోయిన మురుగు కాల్వలు, గుంతల్లో నిలిచిపోయిన వర్షపునీరు, రహదార్ల పక్కనే పేరుకుపోయిన చెత్తకుప్పలు.. ఇలా ఒకటేమిటి ఆటోనగర్ పేరు చెబితేనే హడలిపోయే పరిస్థితి నెలకొంది. పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు