Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 02 Jul 2024 17:00 IST

1. కేంద్రం నిధులను వైకాపా పక్కదారి పట్టించింది: నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి

వైకాపా పాలనలో ఏపీకి ఒక్క ఐటీ కంపెనీ కూడా రాలేదని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి విమర్శించారు. లోక్‌సభలో ఆమె తొలిసారి మాట్లాడారు. ‘‘హైదరాబాద్‌ ప్రగతిలో చంద్రబాబు ముద్ర ఉంది. తెదేపా హయాంలో ఏపీ బాగా అభివృద్ధి చెందింది. పూర్తి కథనం

2. బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.249 ప్లాన్‌.. 45 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2GB డేటా

ప్రైవేట్‌ టెలికాం కంపెనీలన్నీ రీఛార్జ్‌ ప్లాన్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. జులై 3 నుంచి జియో, ఎయిర్‌టెల్‌.. జులై 4 నుంచి వొడాఫోన్‌ ఐడియా టారిఫ్‌లు పెరగనున్నాయి. దీంతో యూజర్లంతా తక్కువ ధరతో ఉన్న ప్లాన్ల కోసం వెతుకుతున్నారు. పూర్తి కథనం

3. హిట్‌మ్యాన్‌తో కోహ్లీ ఫొటో.. రోహిత్ శర్మ తల్లి ఇన్‌స్టా పోస్టు వైరల్

టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్‌లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాను ఓడించి 17 ఏళ్ల తర్వాత పొట్టి కప్‌ని మరోసారి సాధించింది టీమ్ఇండియా. మ్యాచ్‌ అనంతరం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (Virat Kohli) భావోద్వేగానికి గురయ్యారు. పూర్తి కథనం

4. బ్యాంకింగ్‌ షేర్లలో ఒత్తిడి.. ఆరంభ లాభాలు ఆవిరి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం రికార్డు గరిష్ఠాల వద్ద ప్రారంభమైన సూచీలు.. ఇంట్రాడేలో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌ షేర్లలో ఒత్తిడి కారణంగా సూచీలు ఆరంభ లాభాలను కోల్పోయాయి.  పూర్తి కథనం

5. విజయ్‌ మాల్యాపై నాన్‌- బెయిలబుల్‌ వారెంట్‌.. జారీ చేసిన ముంబయి కోర్టు

పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా (Vijay Mallya)పై నాన్‌- బెయిలబుల్‌ వారెంట్‌ (NBW) జారీ అయింది. ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ (IOB)కు చెందిన రూ.180 కోట్ల రుణం ఎగవేసిన కేసులో ముంబయిలోని ప్రత్యేక కోర్టు ఈ వారెంట్‌ జారీ చేసింది. పూర్తి కథనం

6. భారత్‌-పాక్‌ సంబంధాలపై.. అమెరికా ఏమన్నదంటే?

అనేక అంశాల్లో భారత్‌తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటున్నామని అగ్రరాజ్యం పేర్కొంది. ముఖ్యంగా ఆర్థిక, భద్రతా రంగాల్లో ఎంతో సహకారం ఉందని, ఇదే ఒరవడిని ఇకముందు కొనసాగిస్తామని స్పష్టంచేసింది.  పూర్తి కథనం

7. హీనా ఖాన్‌ నువ్వు వారియర్‌వి.. నటికి ధైర్యాన్నిచ్చిన సమంత

తాను స్టేజ్‌ 3 బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతోన్నట్లు హీనా ఖాన్‌ ఇటీవల తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో సినీ ఇండస్ట్రీలోని ప్రముఖలు ఆమెకు ధైర్యాన్నిస్తున్నారు. తాజాగా హీనా ఖాన్‌ను ఉద్దేశిస్తూ సమంత (Samantha) పోస్ట్‌ పెట్టారు.  పూర్తి కథనం

8. టీజీఆర్టీసీలో 3,035 పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్

తెలంగాణలో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఆర్టీసీలో త్వరలో ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది. మొత్తం 3,035 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. వీటిలో 2000 డ్రైవర్‌ ఉద్యోగాలు, 743 శ్రామిక్‌ ఉద్యోగాలు ఉన్నాయి. ఉద్యోగాల భర్తీకి అనుమతి రావడంపై మంత్రి పొన్న ప్రభాకర్‌ హర్షం వ్యక్తం చేశారు. పూర్తి కథనం

9. పరీక్షకు 2 గంటల ముందే ప్రశ్నపత్రం రెడీ.. ‘నీట్‌ పీజీ’ నిర్వహణకు కీలక నిర్ణయం..!

నీట్‌ యూజీ-2024 (NEET UG 2024) పరీక్ష పేపర్‌ లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా వివాదం నెలకొన్న వేళ నీట్‌ పీజీ 2024 (NEET PG 2024) పరీక్ష నిర్వహణను కేంద్రం వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. అయితే, ఈ నెలాఖరు లేదా ఆగస్టులో నీట్‌ పీజీ పరీక్ష ఉండొచ్చని తెలుస్తోంది.  పూర్తి కథనం

10. బీసీసీఐ స్పెషల్‌ ఫ్లైట్‌.. బార్బడోస్‌ నుంచి భారత్‌కు రానున్న టీమ్‌ఇండియా

17 ఏళ్ల నిరీక్షణకు తెర దించుతూ టీమ్‌ఇండియా (Team India) టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup)ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. బెరిల్‌ హరికేన్‌ ప్రభావంతో రెండు రోజులుగా బార్బడోస్‌లో చిక్కుకుపోయిన టీమ్‌ఇండియా జట్టు స్వదేశానికి పయనం కానుంది.

 పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని