Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 21 Aug 2022 13:10 IST

1. విరాట్ కోహ్లీ.. బాబర్‌ అజామ్‌.. టెస్టుల్లో ఎవరు నం.1..? వాట్సన్‌ ఏమన్నాడంటే..?

పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ ఆటతీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అత్యుత్తమ బ్యాటర్‌గా అతడిని పలువురు మాజీలు పేర్కొంటున్నారు. ఇక ఐసీసీ ర్యాంకింగ్స్‌ విషయానికి వస్తే.. వన్డేలు, టీ20ల్లో నం.1 ర్యాంకులో బాబర్‌ కొనసాగుతున్నాడు. టెస్టుల్లో మూడో స్థానంలో ఉన్నాడు. మూడు ఫార్మాట్లలో టాప్‌ 3లో నిలిచిన ఏకైక బ్యాట్స్‌మన్‌ అతడే. ఈ నేపథ్యంలో పలువురు అతడిని విరాట్‌ కోహ్లీతోనూ పోల్చుతుంటారు. అయితే.. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ షేన్‌ వాట్సన్‌ ఓ ఐసీసీ రివ్యూలో మాట్లాడుతూ.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. శ్రీకాకుళం హైవేపై నారా లోకేశ్‌ను అడ్డుకున్న పోలీసులు..

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో దిగి రోడ్డు మార్గంలో పలాస వెళ్తున్న ఆయన్ను శ్రీకాకుళం నగరం సమీపంలో హైవేపై అడ్డుకున్నారు. పోలీసుల వైఖరిపై తెదేపా శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కొత్తరోడ్డు కూడలి వద్ద తెదేపా ముఖ్యనేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* గౌరవం ఇచ్చిపుచ్చుకోండి!: పోలీసులపై లోకేశ్‌ ఆగ్రహం

3. కాణిపాకంలో వైభవంగా మహా కుంభాభిషేకం

చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి నూతన ఆలయ మహా కుంభాభిషేకం ఆదివారం ఉదయం వైభవంగా జరిగింది. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తుల నడుమ ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా కుంభాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారి దర్శనం కల్పించారు. 9నెలల తరువాత స్వామి వారి మూలవిరాట్ దర్శనానికి భక్తులు పోటెత్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. త్రిష మరోసారి లవ్‌లో ఫెయిల్‌ అయ్యారా..?

నటి త్రిషకు (Trisha) వ్యక్తిగత జీవితంలో మరో ఎదురుదెబ్బ తగిలిందా..? అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు ఆమె అభిమానులు. సోషల్‌మీడియా ఖాతాలో ఆమె తాజాగా పెట్టిన ఓ పోస్టు చర్చనీయాంశంగా మారింది. ‘వర్షం’తో తెలుగు తెరకు పరిచయమై.. చిరంజీవి, వెంకటేశ్‌, నాగార్జున, బాలకృష్ణ వంటి అగ్ర హీరోల సరసన నటించి అందర్నీ మెప్పించారు త్రిష. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో వరుస ప్రాజెక్ట్‌లు చేసి అగ్ర కథానాయికగా రాణించిన ఆమె.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

RGV: ‘ఆర్‌ఆర్‌ఆర్‌ కంటే కార్తికేయ - 2 బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌’

5. 3 వారాల్లో ₹44500 కోట్ల విదేశీ పెట్టుబడులు

జులై నుంచి భారత ఈక్విటీ మార్కెట్‌పై తిరిగి ఆసక్తి కనబరుస్తున్న విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐ) పెట్టుబడులను కుమ్మరిస్తున్నారు. ఆగస్టులో ఇప్పటి వరకు రూ.44,500 కోట్లను భారత మార్కెట్‌లోకి మళ్లించారు. అమెరికాలో ద్రవ్యోల్బణం క్రమంగా కిందకు దిగిరావడం, డాలర్‌ ఇండెక్స్‌ పడిపోవడం వంటి కారణాలు ఎఫ్‌ఐఐల కొనుగోళ్లకు ప్రధాన కారణం. జులై మొత్తంలో రూ.5,000 కోట్ల విలువ చేసే కొనుగోళ్లు మాత్రమే చేపట్టిన మదుపర్లు ఆగస్టులో జోరును పెంచారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కారు బాంబు పేల్చి పుతిన్‌ సన్నిహితుడి కుమార్తె హత్య..!

పుతిన్‌కు అత్యంత సన్నిహితుడైన సహాయకుడు అలెగ్జాండర్‌ డుగిన కుమార్తెను కారు బాంబు పేల్చి మాస్కోలో హత్య చేశారు. పుతిన్‌ ఆలోచనలను ప్రభావితం చేసే వ్యక్తిగా అలెగ్జాండర్‌కు పేరుంది. వాస్తవానికి అలెగ్జాండర్‌ను లక్ష్యంగా చేసుకొని దాడి చేయగా.. అతడి కుమార్తె డార్యా డుగిన మరణించినట్లు అక్కడి మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.  ఈ ఘటన రష్యా కాలమానం ప్రకారం శనివారం జరిగినట్లు ఆ దేశ వార్తా సంస్థ టాస్‌ పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. NTR: అమిత్‌షాతో భేటీ కానున్న ఎన్టీఆర్‌

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ప్రముఖ సినీనటుడు ఎన్టీఆర్‌ భేటీ కానున్నారు. మునుగోడు పర్యటనలో భాగంగా శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకోనున్న అమిత్‌షాను ఎన్టీఆర్‌ కలవనున్నారు. ఎయిర్‌పోర్టు సమీపంలో ఉన్న నోవాటెల్‌ హోటల్‌లో సాయంత్రం వీరిద్దరూ సమావేశం కానున్నారు. అమిత్‌షా-ఎన్టీఆర్‌ భేటీని భాజపా వర్గాలు ధ్రువీకరించాయి. రాజకీయ పరమైన కారణాలా? ఇతర అంశాలా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మనీశ్‌ సిసోదియాపై సీబీఐ లుక్‌ఔట్‌ నోటీసు

దిల్లీ ఎక్సైజ్‌ విధానంలో అవకతవకలకు సంబంధించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా (Manish Sisodia)పై సీబీఐ ఆదివారం లుక్‌ఔట్‌ నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన దేశం విడిచి వెళ్లిపోవడానికి వీల్లేకుండా పోయింది. ఆయనతో పాటు ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న మరో 12 మందిపైనా లుక్‌ఔట్‌ నోటీసులు జారీ అయ్యాయి. ఎప్‌ఐఆర్‌లో పేర్కొన్న 15మందిలో ముగ్గురిని శనివారం సీబీఐ అధికారులు ప్రశ్నించారు. కేసు వివరాలను ఈడీ అధికారులకు అందజేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

పలాస వెళ్తున్న అచ్చెన్న, రామ్మోహన్‌ నాయుడును అడ్డుకున్న పోలీసులు

9. 100కుపైగా రుణ యాప్స్‌తో రూ.500 కోట్ల వసూళ్లు

దేశవ్యాప్తంగా రుణ యాప్స్‌ నిర్వహిస్తూ రూ.500 కోట్లు వసూలు చేసిన 22 మంది సభ్యుల ముఠాను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ రాకెట్‌ను చైనా జాతీయులు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ ముఠా మొత్తం 100కుపైగా రుణ యాప్‌లను నిర్వహిస్తోంది. వినియోగదారులకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని సేకరించి చైనా,హాంకాంగ్‌లో ఉన్న సర్వర్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నట్లు విచారణలో తేలింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కిమ్‌ భావోద్వేగ ప్రసంగం.. వెక్కివెక్కి ఏడ్చిన మిలటరీ వైద్య సిబ్బంది

ఎప్పుడూ యుద్ధ నినాదాలు, అణు హెచ్చరికలతో మండే అగ్నిగోళంగా ఉండే ఉత్తర  కొరియా నియంత కిమ్.. తన హృద్యమైన ప్రసంగంతో కంటతడి పెట్టించారు. కరోనా వేళ.. దేశానికి అండగా నిలిచిన ఆర్మీ వైద్యులను ఉద్దేశించి కిమ్ చేసిన వ్యాఖ్యలు.. వారి హృదయాలను హత్తుకున్నాయి. తమ అధ్యక్షుడి మాటలతో తీవ్ర భావోద్వేగానికి గురైన వైద్యులు.. చిన్నపిల్లలా వెక్కివెక్కి ఏడ్చారు. ఇంతకీ కిమ్ ఏం అన్నారు? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని