Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 18 Jul 2022 13:07 IST

1. బైడెన్‌కు అతిపెద్ద షాకిచ్చిన సౌదీ యువరాజు..!

ఎదుటి వారి వైపు ఒక వేలు చూపిస్తే.. నాలుగు వేళ్లు మనవైపే చూపిస్తాయన్నది సామెత. ఇది అమెరికాకు అతికినట్లు సరిపోతుందని ఇటీవల పరిణామాలు వెల్లడిస్తున్నాయి. తాజాగా సౌదీ అధికారిక పర్యటనలో అమెరికా అధ్యక్షుడికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఈ పర్యటన నుంచి అమెరికా సాధించింది అతి స్వల్పమే. రష్యాకు వ్యతిరేక కూటమిలోకి సౌదీని లాగడంలో కూడా బైడెన్‌ విఫలం అయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. సీఎం సొంత జిల్లాలో పాఠశాల దుస్థితి.. గుడిలోనే పాఠాలు!

ఆ ఊళ్లో గుడే వారికి బడి. ఏదిక్కూ లేని వారికి దేవుడే దిక్కన్నట్లు.. ఆ పిల్లలకు స్వామివారి ఆలయమే ఆశ్రయమైంది. కొన్నేళ్లుగా అరకొర వసతుల మధ్య వారి చదువులు సాగుతున్నా.. ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదు. అధికారులూ కన్నెత్తి చూడలేదు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠ శాల దుస్థితిపై ప్రత్యేక కథనం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. వీరు కచ్చితంగా ఐటీఆర్‌ సమర్పించాల్సిందే!

సాధారణంగా ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి దాటినప్పుడు లేదా మన ఆదాయంలో మూలం వద్దే పన్ను కోత ఉంటేనే ఐటీ రిటర్నులు దాఖలు చేయాలని (ITR Filing) భావిస్తుంటారు. కానీ, అది నిజం కాదు. ఆదాయ పన్ను చట్టం (IT Act)లోని సెక్షన్‌ 139 ఏయే సందర్భాల్లో ఐటీఆర్‌ (ITR) దాఖలు చేయాలో స్పష్టంగా చెబుతోంది. ఈ నిబంధనల్లో ఇటీవల కేంద్రం కొన్ని మార్పులు కూడా చేసింది. మరి రిటర్నులు సమర్పించాల్సిన ఆ సందర్భాలేంటో చూద్దాం..! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ప్రారంభమైన రాష్ట్రపతి ఎన్నిక

దేశ తదుపరి రాష్ట్రపతి ఎన్నికకు సోమవారం పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 10 గంటలకు ఓటింగ్‌ మొదలవ్వగా.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఆనవాయితీ ప్రకారం పార్లమెంట్‌ భవనంలో ఎంపీలు, రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అటు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కూడా నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. పార్లమెంట్‌ ప్రాంగణంలో ఓటింగ్‌ మొదలైన వెంటనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన ఓటు వేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌.. ఓటు వేసిన జగన్‌, కేటీఆర్‌

5. IND vs ENG: పంత్‌పై ప్రశంసల జల్లు..!

 టీమ్‌ఇండియా యువ సంచలనం రిషబ్‌పంత్‌పై మాజీలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇంగ్లాండ్‌పై ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టులో అద్భుత శతకంతో రాణించి అందరినీ మెప్పించిన పంత్.. తాజాగా సిరీస్‌ నిర్ణయాత్మక వన్డే మ్యాచ్‌లో అజేయ శతకంతో మరోసారి టీమ్‌ఇండియాను ఆదుకున్నాడు. 260 పరుగుల లక్ష్య ఛేదనలో టీమ్‌ఇండియా 38 పరుగులకే టాప్‌ 3 బ్యాటర్లును కోల్పోయింది. అయితే, నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్‌ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ (113 బంతుల్లో 125; 16ఫోర్లు, 2సిక్సర్లు) ఆడి జట్టును గెలిపించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఘోర ప్రమాదం.. 40మందితో నదిలో పడిన బస్సు

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తోన్న ఓ బస్సు నర్మదా నదిలో బోల్తా పడింది. ఈ ఘటనలో 12 మంది దుర్మరణం చెందారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... మధ్యప్రదేశ్‌ రాజధాని ఇండోర్‌ నుంచి మహారాష్ట్రలోని పుణె వెళ్తోన్న ఓ బస్సు.. ధార్‌ జిల్లాలోని ఖాల్‌ఘాట్‌ ప్రాంతంలో నర్మదా నది వంతెనపై వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బస్సు అదుపుతప్పి వంతెన రైలింగ్‌ను ఢీకొట్టి నదిలోకి పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. నన్ను ప్రశ్నించే వాళ్లందరికీ ఒక్కటే సమాధానం చెబుతా: కిరణ్‌ అబ్బవరం

కష్టపడి పనిచేయడం వల్లే తనకు వరుస సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని యువ నటుడు కిరణ్‌ అబ్బవరం అన్నారు. ప్రస్తుతం నాలుగు కొత్త ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధంగా ఉన్న ఆయన తాజాగా ట్విటర్‌ వేదికగా ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. ఇటీవల తన పుట్టినరోజుని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ.. ‘‘షార్ట్‌ ఫిల్మ్స్‌, ఫీచర్‌ ఫిల్మ్స్‌, నా తదుపరి చిత్రాలు.. ఇలా జీవితంలోని ప్రతిదశలో అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. దొంగలు దోచినట్లు నాదే కాజేస్తున్నారు: భవిష్యవాణిలో స్వర్ణలత

సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహాకాళి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. బోనాల్లో భాగంగా ‘రంగం’ కార్యక్రమం నిర్వహించారు. జోగిని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ‘‘పూజలు మొక్కుబడిగా చేస్తున్నారు. మీరు చేస్తున్న పూజలు.. మీ సంతోషానికే తప్ప నాకోసం కాదు. ఎంత సంతోషంగా చేస్తున్నారో మీ గుండెపై చేయి పెట్టి చెప్పండి. మీరు సంతోషంగా చేస్తున్నారనే నేను స్వీకరిస్తున్నా. నా గుడిలో పూజలు సరిగా జరిపించడం లేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Supreme Court: సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. వ్యక్తిగత డిపాజిట్‌ (పీడీ) ఖాతాలకు మళ్లించిన స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫండ్‌ (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) నిధులను వెనక్కి ఇవ్వాలని సుప్రీం ధర్మాసనం ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రెండు వారాల్లోగా ఆ నిధులు తిరిగి ఇవ్వాలని స్పష్టం చేసింది. దీంతో నిధులు వెనక్కి ఇచ్చేందుకు సిద్ధమని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కొన్ని కొవిడ్‌ బాధిత కుటుంబాలకు ఇంకా పరిహారం అందలేదని న్యాయవాది తెలపగా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Viral Video: కరెంటు బిల్లు ఎక్కువొచ్చిందని.. విద్యుత్ తీగలపై పాకుతూ యువకుడి నిరసన

కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని ఓ వ్యక్తి విద్యుత్ టవర్ ఎక్కి నిరసన తెలిసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. కౌశాంబి ప్రాంతానికి చెందిన అశోక్.. ఈ నెల రూ.8,700 కరెంటు బిల్లు రావడంతో అవాక్కయ్యాడు. హై వోల్టేజ్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. అంతటితో ఆగకుండా విద్యుత్ తీగలపై పాకుతూ ముందుకు వెళ్లాడు. అయితే ఆ సమయంతో కరెంటు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని