Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 18 Jun 2022 13:10 IST

1. Agnipath: అగ్నిపథ్‌ నిరసనల మధ్య కేంద్రం కీలక నిర్ణయం

సైనికుల ఎంపిక కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన అగ్నిపథ్‌ పథకంపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో భాగంగా సైన్యంలో పనిచేసి రిటైర్‌ అయిన అగ్నివీరులకు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, అస్సాం రైఫిల్స్‌ నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్‌ కల్పించనున్నట్లు కేంద్ర హోంశాఖ శనివారం ప్రకటన జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


2. NPS: ఎన్‌పీఎస్ చందాదారులా?రాబోతున్న మార్పులు ఇవే!

జాతీయ ఫించ‌ను ప‌థ‌కంను మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా తీర్చిదిద్దేందుకు పెన్షన్ సెక్టార్ రెగ్యులేటర్.. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ  సిద్ధ‌మైంది. ఎన్‌పీఎస్ చందాదారులు ప‌ద‌వీవిర‌మ‌ణ నాటికి మ‌రింత‌ నిధిని స‌మ‌కూర్చుకునేందుకు గానూ కొత్త ప్ర‌ణాళిక‌ల‌తో వస్తోంది. ఈక్వీటీ పెట్టుబ‌డుల‌ కేటాయింపుల‌ను పెంచ‌డం, మ‌రింత మంది ఫండ్ మేనేజ‌ర్ల‌ను అందుబాటులోకి తీసుకురావ‌డం, ఒక ఏడాదిలో ఆస్తి కేటాయింపును మార్చుకునేందుకు ఎక్కువ అవ‌కాశాలు ఇవ్వడం వంటి వివిధ మార్పుల‌ను తీసుకొచ్చే దిశ‌గా యోచిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


3. Agnipath: పోలీసుల అదుపులో ‘అగ్నిపథ్‌’ అల్లర్ల సూత్రధారి?

అగ్నిపథ్‌ విధానాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చెలరేగిన అల్లర్లను ప్రోత్సాహించారనే అభియోగాలపై ఆవుల సుబ్బారావు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా కంభంలో సుబ్బారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుబ్బారావు నరసరావుపేటలోని సాయి డిఫెన్స్‌ అకాడమీ డైరెక్టర్‌గా ఉన్నారు. అల్లర్లలో సుబ్బారాపు పాత్ర ఉందన్న అనుమానంతో ముందస్తు చర్యల్లో భాగంగా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సుబ్బారావును అదుపులోకి తీసుకున్న పోలీసులు నరసరావుపేటకు తరలిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Hyderabad: సామాజిక మాధ్యమాల్లో వదంతులు.. బంక్‌లకు క్యూ కట్టిన వాహనదారులు


4. Vijayareddy : తెరాసకు షాక్.. కాంగ్రెస్‌లోకి పీజేఆర్‌ కుమార్తె విజయారెడ్డి

పీజేఆర్ కుమార్తె, తెరాస ఖైరతాబాద్ కార్పొరేటర్‌గా ఉన్న విజయారెడ్డి గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 23న కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ మేరకు ఇవాళ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. పీజేఆర్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు విజయారెడ్డి వెల్లడించారు. సోనియాగాంధీ నాయకత్వంలో ముందుకెళ్తానన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


5. India Corona : 70వేల సమీపంలోకి క్రియాశీల కేసులు

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. గత రెండు రోజులుగా 12వేలకుపైగా నమోదైన కొత్త కేసులు.. తాజాగా 13 వేలు దాటాయి. మరోవైపు క్రియాశీల కేసులు క్రమంగా పెరుగుతూ 70 వేలకు సమీపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో  4,84,924 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 13,216  కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో రోజువారీ పాజిటివిటీ రేటు 2.73 శాతానికి పెరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


6. Warangal: రాకేశ్‌ అంతిమయాత్రలో స్వల్ప ఉద్రిక్తత

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ విధానాన్ని వ్యతిరేకిస్తూ చెలరేగిన అల్లర్లలో మృతిచెందిన వరంగల్‌ జిల్లా యువకుడు రాకేశ్‌ మృతదేహంతో భారీ ర్యాలీ చేపట్టారు. రాకేశ్‌ మృతదేహం ఉన్న వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రి నుంచి నర్సంపేట వరకు ఈ అంతిమ యాత్ర సాగింది. ర్యాలీలో రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌, సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్యేలు వినయ్‌ భాస్కర్‌, పెద్ది సుదర్శన్‌ రెడ్డి, ఎంపీ మాలోత్ కవిత, తెరాస శ్రేణులు పాల్గొన్నారు. ర్యాలీలో భాగంగా స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

అగ్నిపథ్ ఆందోళనలు.. రైల్వే స్టేషన్‌ నుంచి రూ.3లక్షలు ఎత్తుకెళ్లిన అల్లరిమూకలు


7. సాగు చట్టాల తరహాలోనే అగ్నిపథ్‌నూ ఉపసంహరించుకోవాలి: రాహుల్‌

రైతుల సుదీర్ఘ నిరసనల అనంతరం సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్న విషయాన్ని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తాజాగా గుర్తుచేశారు. అదే తరహాలో సైనికుల నియామకాల కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకాన్ని సైతం వెనక్కి తీసుకోక తప్పదని ఆయన అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


8. కాబూల్‌ గురుద్వారాలో పేలుళ్లు.. తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన భారత్‌

అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో జంట పేలుళ్లు సంభవించాయి. నగరంలోని కార్తే పర్వాన్‌ గురుద్వారాలో ఈ ఘటన జరిగినట్లు స్థానిక మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. ఈ పేలుళ్లలో ప్రాణనష్టమేమైనా జరిగిందా? అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. గురుద్వారా నుంచి భారీ ఎత్తున పొగ బయటకు వస్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోల ద్వారా తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


9. Fastest 150s: అరెరె బట్లర్‌‌.. రెండు బంతుల్లో ప్రపంచ రికార్డ్‌ మిస్‌

వన్డే క్రికెట్‌లో ఎవరైనా సెంచరీలు కొట్టడం సాధారణ విషయమే. అదే 150 పరుగులు చేయడం.. అంత పెద్ద స్కోరును కూడా అతి తక్కువ బంతుల్లోనే సాధించడం గొప్ప విశేషం. శుక్రవారం నెదర్లాండ్స్‌తో జరిగిన పోరులో ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ జోస్‌ బట్లర్‌ అదేపని చేశాడు. కేవలం 65 బంతుల్లోనే 150 పరుగులు చేసి త్రుటిలో ప్రపంచ రికార్డును మిస్‌ చేసుకున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


10. RRR: రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ల మధ్య ఇంటర్వెల్‌ ఫైట్‌ తీశారిలా!!

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదలై అటు థియేటర్‌, ఇటు ఓటీటీలోనూ సూపర్‌ సక్సెస్‌ సొంతం చేసుకొన్న తరుణంలో కొన్ని సర్‌ప్రైజ్‌ వీడియోలను చిత్రబృందం షేర్‌ చేస్తోంది. సినిమాలోని కీలక సన్నివేశాలను ఎలా చిత్రీకరించారు? వీఎఫ్‌ఎక్స్‌ ఎఫెక్ట్స్‌ ఎలా క్రియేట్‌ చేశారు? ఇలాంటి అంశాలు తెలియజేస్తూ గత కొన్నిరోజుల నుంచి వీడియోలు బయటకు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ వీఎఫ్‌ఎక్స్‌ సంస్థ మకుట  ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఇంటర్వెల్‌ ఫైట్‌ సీన్‌కు  వీఎఫ్‌ఎక్స్‌ ఎలా చేశారో వెల్లడిస్తూ ఓ వీడియో షేర్‌ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు