Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 30 Jun 2024 12:59 IST

1. నేనెప్పుడూ గణాంకాలు చూడను.. భారత్‌ గెలుపే ముఖ్యం: రోహిత్

భారత్ రెండోసారి టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024) విజేతగా నిలిచింది. ధోనీ తర్వాత ఈ ఘనతను సాధించిన కెప్టెన్‌గా రోహిత్ శర్మ చరిత్రలో నిలిచిపోయాడు. ఈసారి కెప్టెన్సీ ఇన్నింగ్స్‌లతో జట్టును ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. గతేడాది వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌కు వచ్చినా ఆస్ట్రేలియా చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. పూర్తి కథనం

2. ‘‘ఆదర్శప్రాయమైన విజయం’’.. టీమ్‌ఇండియాకు ప్రధాని మోదీ ఫోన్‌

దిల్లీ: టీ20 వరల్డ్‌ కప్‌లో విజేతగా నిలిచిన భారత క్రికెట్‌ జట్టుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. సమష్టిగా రాణించి విశ్వ వేదికపై దేశ కీర్తిపతాకాన్ని ఎగురవేసిన ఆటగాళ్లకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు టీమ్‌ఇండియా కృషిని కీర్తిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రికెట్‌ జట్టును అభినందించిన వారిలో ఉన్నారు.పూర్తి కథనం

3. టీ20 ప్రపంచకప్‌ కైవసం.. కోహ్లీ, రోహిత్ భావోద్వేగం

టీ20 ప్రపంచ కప్ గెలిచేందుకు టీమ్‌ ఇండియాకు 17 ఏళ్ల నిరీక్షణ తప్పలేదు. దక్షిణాఫ్రికాపై ఉత్కంఠగా సాగిన ఫైనల్‌ పోరులో విజయం సాధించి టీ20 ప్రపంచ కప్‌ను దక్కించుకుంది. ఈ ప్రయాణంలో జట్టులోని సీనియర్‌ ఆటగాళ్లు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ పోషించిన పాత్ర ఎంతో కీలకం. ఎన్నో ఏళ్లుగా నిరీక్షించిన విజయం దక్కడంతో మ్యాచ్ అనంతరం వారిద్దరూ భావోద్వేగానికి గురయ్యారు.పూర్తి కథనం

4. మైదానంలో మాస్టర్‌మైండ్‌.. రోహిత్‌ స్టైల్‌ కెప్టెన్సీ ఇదీ

రోహిత్‌కు బ్యాటింగ్‌లో అందరికంటే కొంచెం ఎక్స్‌ట్రా టైం ఉంటుందంటారు.. అందుకే షాట్లు కచ్చితంగా ఉండి బంతి బౌండరీ దాటేస్తుంది. అలానే కెప్టెన్సీలో కూడా అతడికి కొంచెం దూరదృష్టి ఎక్కువ. అందరికీ అస్పష్టత ఉన్న అంశాల్లో కూడా అతడు కచ్చితమైన అభిప్రాయానికి రాగలడు.పూర్తి కథనం

5. ‘మాటలు పడి’లేచిన కెరటం... పాండ్య

హార్దిక్‌ మైదానంలో అడుగుపెడితే గేలి చేయడం.. ముంబయి కెప్టెన్‌గా ఎందుకు వచ్చావంటూ ఎగతాళి చేయడం.. ఆల్‌రౌండర్‌గా విఫలమవడంతో విపరీతంగా విమర్శించడం.. ఈ ఏడాది ఐపీఎల్‌లో జరిగిందిదే. కానీ, ఇప్పుడు అతని బ్యాటింగ్‌ అద్భుతమంటూ.. అతని బౌలింగ్‌ అదుర్స్‌ అంటూ పొగిడేస్తున్నారు. టీ20 ప్రపంచకప్‌లో ఆల్‌రౌండర్‌ పాత్రకు న్యాయం చేశాడంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పూర్తి కథనం

6. టీమ్‌ఇండియా మహిళల జట్టు శుభాకాంక్షలు

టీ20 ప్రపంచ కప్ గెలుపొందిన టీమ్‌ఇండియాకు ప్రశంసల వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికు పలువురు సీనియర్‌ క్రికెటర్లు. సినీ, రాజకీయ ప్రముఖులు భారత జట్టును పొగడ్తలతో ముంచెత్తారు. తాజాగా వీరికి టీమ్‌ఇండియా మహిళల జట్టు శుభాకాంక్షలు తెలిపింది. పూర్తి కథనం

7. టీమ్‌ఇండియా గెలుపు సంబరాలు.. అల్లరి పిల్లాడిలా మారిన రాహుల్‌ ద్రవిడ్‌!

టీ20 ప్రపంచ కప్ గెలుపొందిన టీమ్‌ఇండియా ఆటగాళ్లు.. మ్యాచ్‌ అనంతరం సంబరాలు చేసుకున్నారు. టీమ్‌ ఇండియా కోచ్ రాహుల్‌ ద్రవిడ్‌ సైతం జట్టు సభ్యులతో కలసి తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఎప్పుడూ ఎంతో సైలెంట్‌గా కనిపించే ద్రవిడ్ సైతం అల్లరి పిల్లాడిలా మారి టీమ్‌తో కలిసి సంబరాలు చేసుకున్నాడు.పూర్తి కథనం

8. టీమ్‌ఇండియా దేశ ప్రజలందరినీ గర్వించేలా చేసింది: ఆమిర్‌ ఖాన్ ప్రశంసలు

టీ20 ప్రపంచ కప్ గెలుపొందిన టీమ్‌ఇండియాకు ప్రశంసల వెల్లువ కొనసాగుతోంది. తాజాగా బాలీవుడ్‌ ప్రముఖ నటుడు ఆమిర్‌ ఖాన్ భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజలందరినీ గర్వించేలా చేశారని కొనియాడారు.పూర్తి కథనం

9. టీ20 ప్రపంచ కప్ ట్రోఫీతో రోహిత్‌, విరాట్‌ విజయ దరహాసం

టీ20 ప్రపంచ కప్ గెలుపొందిన టీమ్‌ఇండియా ఆటగాళ్లు.. మ్యాచ్‌ అనంతరం సంబరాలు చేసుకున్నారు. మ్యాచ్‌ అనంతరం  కెప్టెన్ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ ట్రోఫీతో ఇలా ఫొటోలకు పోజులిచ్చారు. వీరిద్దరూ మ్యాచ్ అనంతరం భారత్‌ తరఫున టీ20 సిరీస్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.పూర్తి కథనం

10. గెలుపు సంబురంలో కోహ్లీ.. ఫ్యామిలీకి వీడియో కాల్‌!

టీ20 ప్రపంచ కప్ గెలుపొందిన టీమ్‌ఇండియా ఆటగాళ్లు.. మ్యాచ్‌ అనంతరం సంబరాలు చేసుకున్నారు. టీమ్‌ ఇండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లీ తన ఆనందాన్ని కుటుంబంతో పంచుకున్నాడు. ఇంటి వద్ద ఉన్న తన భార్య, అనుష్క శర్మ, కుమార్తెకు వీడియో కాల్ చేసి తన సంతోషాన్ని షేర్‌ చేసుకున్నాడు. పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు