Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 29 Jun 2024 13:12 IST

1. పింఛన్‌దారులకు ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛన్‌దారులకు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. ‘మీకు అండగా నిలుస్తూ, సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది. మేనిఫెస్టోలో చెప్పినట్లు పింఛన్‌ను ఒకేసారి రూ.వెయ్యి పెంచి ఇస్తున్నాం. పూర్తి కథనం

2. పంచశీల ఒప్పందం భేష్‌.. నెహ్రూ విధానాలపై చైనా అధ్యక్షుడి ప్రశంసలు

బీజింగ్‌: వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దు వివాదానికి సంబంధించి భారత్‌తో ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ (Xi Jinping) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత (India) విదేశాంగ విధానంలో ప్రధానమైన పంచశీల ఒప్పందాన్ని (Panchsheel Agreement) ఆయన ప్రస్తావించారు. పూర్తి కథనం

3. జీఏడీకి రిపోర్టు చేయండి.. ముగ్గురు అఖిల భారత సర్వీసు అధికారులకు ఏపీ ప్రభుత్వ ఆదేశాలు

అమరావతి: ముగ్గురు అఖిల భారత సర్వీసు అధికారులను సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాలని ఆదేశిస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ ఓఎస్డీ బి.అనిల్ కుమార్ రెడ్డి, ఏపీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్ ఇన్కాప్ ఎండీ నీలకంఠారెడ్డి, సంప్రదాయేతర ఇంధన వనరులు కార్పొరేషన్ ఎండీ నంద కిషోర్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది.పూర్తి కథనం

4. అధికారిక లాంఛనాలతో డీఎస్‌ అంత్యక్రియలు

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్‌ కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు.పూర్తి కథనం

5. సైనిక విన్యాసాలు చేస్తుండగా ఆకస్మిక వరదలు.. లద్దాఖ్‌లో ఐదుగురు జవాన్ల మృతి

లద్దాఖ్‌: చైనా సరిహద్దుల్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌ (Ladakh)లోని వాస్తవాధీన రేఖ సమీపంలో గల న్యోమా-చుషుల్‌ ప్రాంతంలో భారత సైన్యం (Indian Army) విన్యాసాలు చేస్తుండగా ఆకస్మిక వరదలు (Flash Floods) సంభవించాయి. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.పూర్తి కథనం

6. అవును నేను వృద్ధుడినే.. కానీ: డిబేట్‌లో తడబాటు వేళ బైడెన్ ఏమన్నారంటే..?

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కొన్ని నెలల సమయమే ఉండగా.. అధ్యక్షుడు జోబైడెన్‌ (Joe Biden), మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ (Donald Trump) మధ్య జరిగిన సంవాదం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఈ చర్చ సమయంలో బైడెన్‌ పలుమార్లు తడబాటుకు గురైన తీరు స్వపక్షం డెమోక్రాటిక్ పార్టీలో ఆందోళన కలిగిస్తోంది.పూర్తి కథనం

7. మహిళలూ.. భర్తలతో తాగుడు ఇలా మాన్పించండి: మంత్రి టిప్‌ వైరల్‌

మద్యం వ్యసనం (drinking habit) ఎన్నో సంసారాలను విచ్ఛిన్నం చేస్తోంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి. మద్యపానం, మాదక ద్రవ్యాల వాడకాన్ని అరికట్టే లక్ష్యంతో నిర్వహించిన కార్యక్రమంలో మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh) మంత్రి నారాయణ్ సింగ్ కుశ్వాహా (Narayan Singh Kushwaha) ఓ సూచన చేశారు.పూర్తి కథనం

8. చంద్రబాబు కార్యసాధకుడు.. అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తారు: సుమన్‌

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్యసాధకుడు అని ప్రముఖ సినీ నటుడు సుమన్‌ కొనియాడారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘చంద్రబాబు పాలనలో అమరావతి రాజధాని నిర్మాణం వేగంగా జరుగుతోంది. చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టించబోతున్నారు. పూర్తి కథనం

9. మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత

హైదరాబాద్‌: ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి ఉట్నూర్‌లోని తన నివాసంలో అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి  విషమించడంతో హైదరాబాద్‌కు తీసుకువస్తుండగా.. మార్గమధ్యంలో తుది శ్వాస  విడిచారు. ఆయన మృతి పట్లు పలువురు నేతలు సంతాపం ప్రకటించారు. పూర్తి కథనం

10. ఏయూలో జరిగిన అవినీతిపై న్యాయవిచారణ చేయిస్తాం: సి.ఎం.రమేశ్‌

వీసీ ప్రసాదరెడ్డి రాజీనామాతో ఆంధ్రా వర్సిటీలో విద్యార్థులు సంబరాలు చేసుకుంటున్నారు. విశ్వవిద్యాలయానికి పూర్వ విద్యార్థులు భారీగా చేరుకుంటున్నారు. భాజపా ఎంపీ సి.ఎం. రమేశ్‌, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తదితరులు అక్కడికి వెళ్లారు. నాయకులకు ఆంధ్రా వర్సిటీ విద్యార్థులు, పరిశోధకులు ఘన స్వాగతం పలికారు.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని