Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 04 Jul 2024 13:14 IST

1. కరకట్టపై దస్త్రాల దహనం.. విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశం

అమరావతి: కృష్ణా నది కరకట్టపై దస్త్రాలను తగులబెట్టిన అంశంలో పూర్తిస్థాయి విచారణకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రాత్రి వేళ రహస్యంగా ప్రభుత్వ వాహనంలో వచ్చి కరకట్టపై బస్తాలను దించి తగులబెట్టడాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. పూర్తి కథనం

2. మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న నారా లోకేశ్

దుగ్గిరాల: మంత్రి నారా లోకేశ్‌ గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో పర్యటించారు. కంఠంరాజు కొండూరులోని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. వేద పండితులు ఆశీర్వచనాలిచ్చారు.పూర్తి కథనం

3. వైకాపా కార్యాలయాల కూల్చివేతలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

అమరావతి: రాష్ట్రంలో వైకాపా కార్యాలయాల కూల్చివేతల అంశంలో దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కూల్చివేతల్లో చట్టనిబంధనలు పాటించాలని ఆదేశించింది. ప్రతిదశలో వైకాపా తరఫున వాదనలు వినిపించేందుకు అవకాశమివ్వాలని పేర్కొంది.పూర్తి కథనం

4. ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ

దిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు దిల్లీ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రానికి ఆర్థికసాయం, ఇతర అంశాలపై సుమారు అరగంటపాటు ప్రధానితో చర్చించారు. అంతకుముందు రాష్ట్రానికి చెందిన ఎన్డీయే ఎంపీలతో కలిసి కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ను చంద్రబాబు కలిశారు.పూర్తి కథనం

5. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి భేటీ

దిల్లీ: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి దిల్లీ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సీఎం వెంట ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉన్నారు.పూర్తి కథనం

6. ద్వితీయ శ్రేణినగరాల్లోనూ ఐటీ విస్తరిస్తాం: మంత్రి శ్రీధర్‌బాబు

హనుమకొండ: రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ విస్తరించాలన్నదే తమ సంకల్పమని తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. హనుమకొండలో రాక్స్‌ ఐటీ పార్కును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఐటీ పరిశ్రమకు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. విదేశాల్లోని తెలంగాణ వాసులు రాష్ట్రానికి వచ్చి ఐటీ కార్యాలయాలు స్థాపించాలని కోరారు. పూర్తి కథనం

7. ఇంకా పరారీలోనే భోలే బాబా.. ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh)లోని హాథ్రస్‌లో భోలే బాబా (Bhole Baba) సత్సంగ్‌ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట ఘటన యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి అరెస్టులు చోటుచేసుకోకపోవడం గమనార్హం. పూర్తి కథనం

8. వాయు కాలుష్యంతో భారత్‌లో ఏటా 33 వేల మరణాలు: లాన్సెట్

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో ప్రతీ సంవత్సరం 11.5 శాతం మరణాలు (దాదాపు 12,000 మంది) వాయు కాలుష్యం (Air Pollution) కారణంగా సంభవించి ఉండొచ్చని ప్రముఖ వైద్య పరిశోధన మాసపత్రిక లాన్సెట్‌లో ప్రచురితమైన ఓ నివేదిక అంచనా వేసింది. కాలుష్యం కారణంగా దేశంలో అత్యధిక మరణాలు సంభవిస్తుంది ఈ మహానగరంలోనేనని తెలిపింది.పూర్తి కథనం

9. సందేహం అక్కర్లేదు.. నేనే అధ్యక్ష అభ్యర్థిని: బైడెన్‌

వాషింగ్టన్‌: డెమోక్రాటిక్‌ పార్టీ తరఫున రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేది తానేనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) స్పష్టం చేశారు. పోటీ నుంచి వైదొలగాలని తనపై ఎలాంటి ఒత్తిడి లేదని తెలిపారు. గతవారం రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి ట్రంప్‌తో (Donald Trump) జరిగిన సంవాదంలో బైడెన్ తడబడిన విషయం తెలిసిందే. పూర్తి కథనం

10. రిషి సునాక్‌కు మళ్లీ విజయం దక్కేనా? బ్రిటన్‌లో మొదలైన ఓటింగ్‌

లండన్‌: బ్రిటన్‌లో సార్వత్రిక సమరం (UK Parliament Elections) మొదలైంది. స్థానిక కాలమానం ప్రకారం గురువారం ఉదయం 7 గంటలకు పార్లమెంట్‌ ఎన్నికలకు ఓటింగ్‌ ప్రారంభమైంది. కొత్త ప్రధానిని ఎన్నుకునేందుకు పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో రిషి సునాక్‌ (Rishi Sunak) నేతృత్వంలోని అధికార కన్జర్వేటివ్‌ పార్టీ, కెయిర్‌ స్టార్మర్‌ ఆధ్వర్యంలోని లేబర్‌ పార్టీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని