Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 03 Jul 2024 13:01 IST

1. మంత్రి నారా లోకేశ్‌ ‘ప్రజాదర్బార్‌’కు అనూహ్య స్పందన.. భారీగా తరలివచ్చిన ప్రజలు

అమరావతి: మంత్రి నారా లోకేశ్‌ నిర్వహిస్తున్న ‘ప్రజాదర్బార్‌’కు మంచి స్పందన లభిస్తోంది. బుధవారం ఉదయం నుంచే ఉండవల్లి నివాసం వద్ద వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, యువత, ఉద్యోగులు, వివిధ సంఘాల ప్రతినిధులు బారులు తీరారు. లోకేశ్‌ ప్రతి ఒక్కరి వద్ద వినతి పత్రాలు స్వీకరించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని వారికి భరోసా ఇచ్చారు. పూర్తి కథనం

2. పట్టిసీమను జగన్‌ ఒట్టిసీమ అన్నారు.. ఇప్పుడదే బంగారమైంది: మంత్రి నిమ్మల

కొయ్యలగూడెం గ్రామీణం: దేశాన్ని కరవు రహితంగా మార్చాలంటే నదుల అనుసంధానమే మార్గమని ఏపీ జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది సీఎం చంద్రబాబేనని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుతోనే నదుల అనుసంధానం సాకారమన్నారు.పూర్తి కథనం

3. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు: కేటీఆర్‌

భారాస ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు చేయడంపై ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అవినీతిపై పోరాటం చేస్తున్నందుకే కేసు నమోదు చేశారని విమర్శించారు. ఇలాంటి బెదిరింపులకు భారాస నేతలు భయపడేది లేదన్నారు.పూర్తి కథనం

4. కొత్త చట్టం కింద భారాస ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు 

కరీంనగర్: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కరీంనగర్ ఒకటో ఠాణాలో కేసు నమోదైంది. మంగళవారం నిర్వహించిన జిల్లా పరిషత్ సమావేశంలో అధికారుల విధులకు ఆటంకం కలిగించారనే ఫిర్యాదుతో కొత్తగా అమల్లోకి వచ్చిన చట్టం కింద కేసు నమోదు చేశారు. భారత న్యాయ సంహిత సెక్షన్ 122, 126(2) కింద పోలీసులు కేసు ఫైల్‌ చేశారు.పూర్తి కథనం

5. నీట్‌ వివాదం.. నటుడు విజయ్ కీలక వ్యాఖ్యలు

చెన్నై: దేశ వ్యాప్తంగా వైద్య సీట్ల భర్తీ కోసం నిర్వహించే నీట్‌యూజీ-2024 (NEET UG-2024) పరీక్ష నిర్వహణపై దేశవ్యాప్తంగా గందరగోళం నెలకొంది. అదే సమయంలో పేపర్ లీక్‌ ఘటనలు వెలుగులోకి రావడం దుమారం రేపింది. దీనిపై చర్చ జరపాలని పార్లమెంట్‌లో విపక్షాలు పట్టుబడుతున్నాయి.పూర్తి కథనం

6. హాథ్రస్‌ తొక్కిసలాట ఘటన.. భోలే బాబా ఎక్కడ..?

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌ (Uttarpradesh)లోని హాథ్రస్‌లో భోలే బాబా సత్సంగ్‌ కార్యక్రమం పలు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. బాబా పాద ధూళి కోసం జనం ఒక్కసారిగా ఎగబడటంతో భారీ తొక్కిసలాట (Hathras stampede) చోటుచేసుకుంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 121కి చేరింది. కాగా.. ఈ విషాదం తర్వాత భోలే బాబా ఆచూకీ తెలియరావట్లేదు.పూర్తి కథనం

7. ఉద్యోగులకు జీతాలు పెంచారని.. యజమానులకు జైలు

సైన్యం పాలనలో మయన్మార్‌ (Myanmar) ప్రజలు తీవ్రంగా సతమతమవుతున్నారు. సైన్యం కఠిన చట్టాల కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఉద్యోగులకు జీతాలు పెంచారన్న (Wage Hike) కారణంతో కొంతమంది దుకాణ యజమానులను అక్కడి సైనిక ప్రభుత్వం జైలుకు పంపించింది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న వేళ సిబ్బందికి వేతనాలను పెంచడం నేరంగా పరిగణించింది.పూర్తి కథనం

8. బైడెన్‌ డిమెన్షియాను దాచిపెట్టారు..కమలా హ్యారిస్‌ ఆయన స్థానాన్ని భర్తీ చేయొచ్చు..!

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం ప్రారంభమైన దగ్గరి నుంచి అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) ఆరోగ్యమే హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రత్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) విమర్శల్లో ఈ విషయమే ఎక్కువగా వినిపిస్తోంది. దీనికితోడు ఇద్దరిమధ్య ఇటీవల జరిగిన ప్రత్యక్ష చర్చలో బైడెన్ తడబాటుకు గురికావడం సొంతపక్షం డెమోక్రాటిక్‌ నేతల్లో ఆందోళనకు దారితీసింది.పూర్తి కథనం

9. బెంబేలెత్తించిన బెరిల్‌.. మొత్తం ద్వీపం ధ్వంసం!

కరీబియన్‌ దీవుల్లో భీకర ‘బెరిల్‌’ హరికేన్‌ (Hurricane Beryl) భారీ విధ్వంసమే సృష్టించింది. దాదాపు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు అనేక దీవుల్లో తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టానికి దారితీశాయి. 20 ఏళ్ల క్రితం వచ్చిన ‘ఐవాన్‌’ తర్వాత.. అంతటి భారీ హరికేన్‌ ఇదేనని స్థానిక అధికారిక యంత్రాంగం వెల్లడించింది.పూర్తి కథనం

10. ప్రధాన బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ వడ్డీ రేట్లు ఇవే..

ఎన్ని పెట్టుబడి సాధనాలు ఉన్నా ఎటువంటి రిస్క్‌ లేకుండా రాబడి వస్తుందని చాలా మంది ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (FD)పైనే మక్కువ చూపుతారు. ప్రస్తుతం ఆర్‌బీఐ రెపో రేట్లు పెంచిన నేపథ్యంలో బ్యాంకులు ఎఫ్‌డీలపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. అయితే, బ్యాంకుల్లో ఎవరైనా ఎఫ్‌డీలు చేసే ముందు వడ్డీ రేట్లను సరిపోల్చుకోవడం ముఖ్యం. పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని