Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 01 Jul 2024 13:07 IST

1. పిఠాపురం ప్రజలకు రుణపడి ఉంటా: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్

గొల్లప్రోలు: భారీ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం ప్రజలకు రుణపడి ఉంటానని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పలువురు లబ్ధిదారులకు పింఛన్లు అందజేసిన అనంతరం మాట్లాడారు. పూర్తి కథనం

2. వైకాపా మాజీ ఎంపీ నందిగం సురేశ్ సోదరుడు అరెస్ట్‌

అమరావతి: వైకాపాకు చెందిన బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ సోదరుడు ప్రభుదాస్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇసుక అక్రమ తరలింపు వ్యవహారంలో ఆయన్ను అరెస్ట్‌ చేశారు. ఉద్ధంరాయునిపాలెంలో ఇసుక తరలిస్తు్న్న లారీలను పోలీసులు పట్టుకున్నారు.పూర్తి కథనం

3. పింఛన్‌ లబ్ధిదారుల కాళ్లు కడిగిన మంత్రి నిమ్మల రామానాయుడు

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు పింఛన్లు పంపిణీ చేశారు. దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులకు.. పెరిగిన సొమ్ముతో కలిపి పింఛన్లు అందజేశారు. పింఛన్ సొమ్మును ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసిన మంత్రి నిమ్మల లబ్ధిదారుల కాళ్లు కడిగారు.పూర్తి కథనం

4. మొరాయించిన శ్రీశైలం దేవస్థానం వెబ్‌సైట్‌.. నిలిచిన ఆన్‌లైన్‌ టికెట్ల జారీ

శ్రీశైలం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానం వెబ్‌సైట్‌ మొరాయించింది. ఆదివారం సాయంత్రం నుంచి ఆలయ వెబ్‌సైట్‌ పనిచేయడం లేదు. సాంకేతిక సమస్యలతో ఆన్‌లైన్‌ టికెట్ల జారీ నిలిచిపోయింది. దీంతో ఆలయ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. మాన్యువల్‌ దర్శనం టికెట్లను జారీ చేశారు.పూర్తి కథనం

5. పశ్చిమ బెంగాల్ మహిళలకు సురక్షితం కాదు: జేపీ నడ్డా

దిల్లీ: పశ్చిమ బెంగాల్‌(West Bengal)లో ఓ జంటపై జరిగిన దాడి విషయంలో భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) సోమవారం స్పందించారు. రాష్ట్రంలో బహిరంగంగా దాడులు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. పూర్తి కథనం

6. ఏపీలో ఇంజినీరింగ్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం

అమరావతి: ఏపీలో ఇంజినీరింగ్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. నేటి నుంచి 7వ తేదీ వరకు ప్రాసెసింగ్‌ ఫీజు, రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. జులై 4 నుంచి 10 వరకు ధ్రువపత్రాల పరిశీలన, 8-12 వరకు కోర్సులు, కళాశాలల ఎంపిక కోసం ఆప్షన్ల నమోదుకు అవకాశం ఇచ్చారు.పూర్తి కథనం

7. 1995 నాటి సీఎంను చూస్తారు.. చంద్రబాబు, లోకేశ్‌ మధ్య ఆసక్తికర సంభాషణ

మంగళగిరి: గతంలో పరదాల సీఎంను మనం చూశామని.. ఇప్పుడు ప్రజల ముఖ్యమంత్రిని చూస్తున్నామని మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) అన్నారు. పింఛన్ల పంపిణీ అనంతరం మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు(Chandrababu)తో కలిసి మంత్రి పాల్గొన్నారు.పూర్తి కథనం

8. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు.. టీ20 వరల్డ్‌ కప్‌ విజయంపై టీమ్‌ఇండియాకు అభినందనలు

దిల్లీ: టీ20 వరల్డ్‌ కప్‌ 2024 (T20 World Cup 2024) టైటిల్ సొంతం చేసుకున్న భారత క్రికెట్‌ జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో టీమ్‌ఇండియా ప్రస్తావన వచ్చింది. మన జట్టుకు ఎంపీలంతా అభినందనలు తెలియజేశారు.పూర్తి కథనం

9. ఐటీ రిటర్నులు ఫైల్‌ చేస్తే కలిగే ప్రయోజనాలు తెలుసా?

గత ఆర్థిక సంవత్సరానికి గానూ ఆదాయపు పన్ను రిటర్నులను (Income Tax Returns- ITR) దాఖలు చేసేందుకు సమయం వచ్చేసింది. జులై 31 లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. నిర్దేశించిన పరిమితికి మించి ఆదాయం ఉన్నప్పుడు.. నిర్ణీత శ్లాబుల్లో పన్ను చెల్లించాలి.పూర్తి కథనం

10. శ్రీలంక టూర్‌కు కొత్త హెడ్ కోచ్‌.. మా నెక్ట్స్‌ టార్గెట్ ఆ రెండు టైటిల్స్‌: జై షా

టీమ్ఇండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం 2024 టీ20 ప్రపంచకప్‌తో ముగిసింది. ఇప్పటికే కొత్త హెడ్‌ కోచ్‌ కోసం బీసీసీఐ దరఖాస్తులు స్వీకరించింది. ఇందులో మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir), భారత మహిళల జట్టుకు గతంలో కోచ్‌గా వ్యవహరించిన డబ్ల్యూవీ రామన్‌ పేర్లను షార్ట్‌లిస్ట్ చేశారు.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు