Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 29 Jun 2024 20:59 IST

1. ప్రజా సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే ప్రత్యేక వేదిక: చంద్రబాబు

ప్రజా సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తానని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వెళ్తానని ఇటీవల హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఎన్టీఆర్‌ భవన్‌కు వెళ్లారు. అక్కడే ప్రజల నుంచి వినతులు స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. పూర్తి కథనం

2. హైదరాబాద్‌తో సమానంగా వరంగల్‌ అభివృద్ధి: సీఎం రేవంత్‌

వరంగల్‌ అభివృద్ధికి సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, హైదరాబాద్‌తో సమానంగా వరంగల్‌ను అభివృద్ధి చేయాలని అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. వరంగల్‌ పర్యటనలో ఉన్న ఆయన నగర అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పూర్తి కథనం

3. డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసును మళ్లీ విచారించండి: ముప్పాళ్ల సుబ్బారావు

దళిత యువకుడు, డ్రైవర్‌ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసును తిరిగి విచారించాలని, విధి నిర్వహణలో అలసత్వాన్ని ప్రదర్శించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఏపీ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, సీనియర్‌ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పూర్తి కథనం

4. మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారం.. పోక్సో కేసు నమోదు

బాపట్ల జిల్లాలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచార ఘటన కలకలం రేపింది. నిజాంపట్నం మండలంలో 16 ఏళ్ల బాలికపై ఐదుగురు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. వేమూరు మండలానికి చెందిన బాలిక.. శుక్రవారం తన అమ్మమ్మ ఇంటికి వెళ్లింది.  పూర్తి కథనం

5. దక్షిణాఫ్రికాతో ఏకైక టెస్టు.. రెండో రోజు ముగిసిన ఆట

దక్షిణాఫ్రికాతో ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత అమ్మాయిల జట్టు భారీ విజయం దిశగా సాగుతోంది. ఓవర్‌ నైట్‌ 525/4 స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. 603/6 వద్ద డిక్లేర్డ్‌ చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. పూర్తి కథనం

6. ఎస్‌బీఐ ఛైర్మన్‌గా చల్లా శ్రీనివాసులు.. ప్రతిపాదించిన ఎఫ్‌ఎస్‌ఐబీ

ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఎస్‌బీఐ (SBI) తదుపరి ఛైర్మన్‌గా చల్లా శ్రీనివాసులు శెట్టిని నియమించాలని కేంద్ర పరిధిలోని స్వయంప్రతిపత్త సంస్థ అయిన ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఇనిస్టిట్యూషన్స్‌ బ్యూరో (FSIB) ప్రతిపాదించింది. పూర్తి కథనం

7.  సీబీఐ జ్యుడీషియల్‌ కస్టడీకి కేజ్రీవాల్‌.. అనుమతించిన కోర్టు

మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన ఆప్ జాతీయ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)ను 14 రోజుల పాటు సీబీఐ జ్యుడీషియల్‌ కస్టడీకి అనుమతిస్తూ దిల్లీ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. పూర్తి కథనం

8. ‘దీనికి నెహ్రూను నిందించొద్దు ప్లీజ్‌’.. భాజపా పోస్ట్‌ వైరల్‌

భారీ వర్షాల కారణంగా దిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్‌-1 పైకప్పులో కొంతభాగం శుక్రవారం కూలిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన 24 గంటల్లోనే గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ విమానాశ్రయం (Rajkot Airport)లో పైకప్పుగా ఏర్పాటు చేసిన టెంట్‌ ఊడిపడిపోయింది. పూర్తి కథనం

9. అంతరిక్ష కేంద్రాన్ని తొలగించేందుకు రూ.7వేల కోట్లు.. మస్క్‌కు నాసా కాంట్రాక్ట్‌

భూ ఉపరితలానికి కొన్ని వందల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని (International Space Station) త్వరలోనే తొలగించనున్నారు. ఈ దశాబ్దం చివరికల్లా ఐఎస్‌ఎస్‌ను కూల్చివేయనున్నారు. పూర్తి కథనం

10. సభాపతిగా హుందాగా ప‌ని చేస్తా: అయ్యన్నపాత్రుడు

అతి చిన్న వయసులో ఎన్టీఆర్‌ తనకు మంత్రి పదవి ఇచ్చారని, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పీకర్ పదవితో గౌరవించారని అయ్యన్నపాత్రుడు అన్నారు. చంద్రబాబు నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. సభాపతిగా హుందాగా పని చేస్తానని తెలిపారు. పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని