Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 25 Jun 2024 20:59 IST

1. యూపీఐ, యూట్యూబ్‌తో నోకియా 3 ఫీచర్‌ ఫోన్లు

నోకియా (Nokia) బ్రాండ్‌పై ఫోన్లు తయారుచేసే హెఎండీ గ్లోబల్‌ సంస్థ.. మూడు కొత్త ఫీచర్‌ ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 25 ఏళ్ల తర్వాత 3210 మోడల్‌ను మళ్లీ ప్రవేశపెట్టింది. దీంతో పాటు నోకియా 235 4జీ (Nokia 235 4G), నోకియా 220 4జీ (Nokia 220 4G) పేరిట మరో రెండు ఫోన్లనూ తీసుకొచ్చింది.   పూర్తి కథనం

2. ‘సలార్‌’ రికార్డును బ్రేక్‌ చేసిన ‘కల్కి’.. ఎన్ని టికెట్స్‌ అమ్ముడయ్యాయంటే!

ప్రభాస్‌ హీరోగా నాగ్ అశ్విన్‌ తెరకెక్కించిన ‘కల్కి’ విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ప్రీ సేల్‌ బుకింగ్స్‌లో ఇప్పటికే కొన్ని బ్లాక్‌ బస్టర్‌ చిత్రాల రికార్డులను బ్రేక్‌ చేయగా.. ఇప్పుడు ‘సలార్‌’ (Salaar) రికార్డును కూడా అధిగమించింది.  పూర్తి కథనం

3. పేద విద్యార్థులకు సేవ పేరుతో దోపిడీ.. కేసు నమోదు చేసిన ఈడీ

విదేశాల నుంచి వచ్చిన విరాళాలు పక్కదారి పట్టించిన వ్యవహారంలో సోదాలు జరిపిన ఈడీ.. ఆపరేషన్ మొబిలిటి(ఓమ్‌)పై మనీలాండరింగ్‌ చట్టం కింద కేసు నమోదు చేసింది. తెలంగాణ సీఐడీలో నమోదైన కేసు ఆధారంగా మరో కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు మొత్తం 11 చోట్ల సోదాలు నిర్వహించారు. పూర్తి కథనం

4. మూలధన వ్యయాలను భారీగా పెంచనున్న అదానీ గ్రూప్‌

భారత్‌లో ప్రముఖ పోర్ట్‌లతో పాటు అనేక విద్యుత్‌ సంస్థలను నిర్వహించే ప్రముఖ వ్యాపార సంస్థ అదానీ గ్రూప్‌ 2025 ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయాలను రూ.70 వేల కోట్ల నుంచి రూ.1.30 లక్షల కోట్లకు పెంచనుందని సంస్థ CFO జుగేషిందర్‌ సింగ్‌ మంగళవారం తెలిపారు. పూర్తి కథనం

5. ‘ మీ విమానం ఎక్కను’: ఎయిరిండియా సేవలపై ఓ నెటిజన్ అసహనం

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా (Air India) విమానంలో ఎదురైన అనుభవంపై ఓ ప్రయాణికుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇంకెప్పుడూ ఆ సంస్థకు చెందిన విమానంలో ప్రయాణించనని, దానికంటే ఎడ్లబండి నయం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదిత్య కొందవార్‌ అనే నెటిజన్ ఈ మేరకు ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్టు పెట్టారు. పూర్తి కథనం

6. బెయిల్‌ పిటిషన్ల ‘వాయిదా’లపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

బెయిల్‌ అంశాలకు సంబంధించి భారత సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. వాటిని అనవసరంగా వాయిదా వేయకూడదని దిల్లీ హైకోర్టును ఉద్దేశిస్తూ పేర్కొంది. మనీలాండరింగ్‌ కేసులో దిల్లీ మాజీ మంత్రి సత్యేందర్‌ జైన్‌ బెయిల్‌ విజ్ఞప్తిపై తదుపరి విచారణలో నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది. పూర్తి కథనం

7. దుబాయ్‌లో లక్కీడ్రా.. తెలుగువ్యక్తికి రూ.2.25కోట్లు క్యాష్‌ ప్రైజ్‌

ఉపాధి కోసం అరబ్‌ దేశం యూఏఈ (UAE)లోని దుబాయ్‌ వెళ్లిన ఓ తెలుగు వ్యక్తికి అదృష్టం వరించింది. నెల నెలా తాను చేసిన పొదుపుతో ఏకంగా రూ.2.25 కోట్లు గెలుచుకున్నారు. సేవింగ్స్‌ స్కీమ్‌ చందాదారులకు లక్కీ డ్రా నిర్వహించగా.. అందులో అతడు విజేతగా నిలిచారు.  పూర్తి కథనం

8. ‘ఎమర్జెన్సీ’ బంపర్‌ గిఫ్ట్‌..! కర్ణాటకలో పాల ధరల పెంపుపై ప్రతిపక్షాల ఎద్దేవా

నందిని పాల ధరలను పెంచుతూ ‘కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌ (KMF)’ నిర్ణయం తీసుకుంది. జూన్‌ 26 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ఇటీవలే కర్ణాటకలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగిన వేళ ఈ నిర్ణయం వెలువడింది. ఈ వ్యవహారం కాస్త రాష్ట్ర రాజకీయాల్లో విమర్శలకు దారితీసింది. అధికార కాంగ్రెస్‌ ప్రభుత్వమే దీనికి కారణమంటూ ప్రతిపక్షాలు ఆరోపించగా.. అది సంస్థ స్వతంత్ర నిర్ణయమంటూ సిద్ధరామయ్య సర్కారు కొట్టిపారేసింది. పూర్తి కథనం

9. పుణె కారు ప్రమాదం కేసులో బాంబే హైకోర్టు తీర్పు

దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన పుణె కారు ప్రమాదం కేసులో (Pune Porsche Case) బాంబే హైకోర్టు (Bombay High Court) అనూహ్య తీర్పు వెలువరించింది. నిందితుడిని తక్షణమే బెయిల్‌పై విడుదల చేయాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్‌ భారతి దాంగ్రే, జస్టిస్‌ మంజుషా దేశ్‌పాండేలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. పూర్తి కథనం

10. నిజ్జర్‌కు ఆ అర్హత లేదు: ట్రూడో సొంత పార్టీలోనే వ్యతిరేకత

ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌కు కెనడా (Canada) పార్లమెంట్‌ దిగువసభలో మౌనం పాటించి నివాళులర్పించడంపై అధికార పక్షంలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. లిబరల్‌ పార్టీకి చెందిన ఎంపీ చంద్ర ఆర్య తాజాగా ట్రూడో నిర్ణయంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని