Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 05 Jul 2024 20:59 IST

1. హైదరాబాద్‌లో చంద్రబాబుకు ఘనస్వాగతం.. భారీగా తరలివచ్చిన తెదేపా శ్రేణులు

ఏపీ సీఎం చంద్రబాబుకు హైదరాబాద్‌లో తెదేపా శ్రేణుల నుంచి ఘనస్వాగతం లభించింది. దిల్లీ పర్యటన ముగించుకుని బేగంపేట విమనాశ్రయానికి చేరుకున్న ఆయనకు తెలంగాణ తెదేపా నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు.  పూర్తి కథనం

2. ఎమ్మెల్సీలుగా సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్‌ ఏకగ్రీవ ఎన్నిక

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఇద్దరి నుంచి మాత్రమే నామినేషన్లు రావడంతో ఎన్నిక ఏకగ్రీవమైందని రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు. పూర్తి కథనం

3. హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం.. స్తంభించిన ట్రాఫిక్‌

హైదరాబాద్‌ నగరంలోని పలు చోట్ల శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. చాదర్‌ఘాట్‌, మలక్‌పేట్‌, సైదాబాద్‌, చంపాపేట్‌, కర్మన్‌ఘాట్‌, దిల్‌సుఖ్‌నగర్‌, సరూర్‌నగర్‌, చైతన్యపురి, కొత్తపేట తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. పూర్తి కథనం

4. ఎర్రచందనం స్మగ్లింగ్‌ వ్యవహారంలో పెద్ద తలకాయలను పట్టుకోవాలి: డిప్యూటీ సీఎం పవన్‌

అరుదైన ఎర్రచందనాన్ని విదేశాలకు అక్రమంగా తరలిస్తున్న వ్యవహారంలో పెద్ద తలకాయలను పట్టుకోవాలని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ ఆదేశించారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నిరోధానికి నిఘా వ్యవస్థను పటిష్టపరచాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. కడప జిల్లా పోట్లదుర్తి జగనన్న కాలనీలో ఎర్రచందనం డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి కథనం

5. ఎంపీలుగా ప్రమాణం చేసిన అమృత్‌పాల్‌ సింగ్‌, ఇంజినీర్‌ రషీద్‌

ఖలిస్థాన్‌ సానుభూతిపరుడు, పంజాబ్‌లోని ఖడూర్‌ సాహిబ్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికైన అమృత్‌పాల్‌ సింగ్‌(Amritpal Singh), ఉగ్రనిధుల కేసు నిందితుడు ఇంజినీర్‌ రషీద్‌(Engineer Rashid) శుక్రవారం ఎంపీలుగా ప్రమాణస్వీకారం చేశారు. పూర్తి కథనం

6. ఆధారాలుంటే.. నన్ను అరెస్టు చేయండి: తేజస్వీ యాదవ్‌ సవాల్‌

నీట్‌-యూజీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం (NEET Row)లో తనపై నిందలు వేసేందుకు నీతీశ్‌ (Nitish kumar) సర్కార్‌ ప్రయత్నిస్తోందని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ (Tejashwi Yadav) అన్నారు. నీట్‌ అంశంపై తనకు వ్యతిరేకంగా ఆధారాలు ఉంటే అరెస్టు చేసుకోవాలని ఎన్డీయే ప్రభుత్వానికి సవాల్‌ విసిరారు.  పూర్తి కథనం

7. ఆ ప్రశ్నాపత్రాలు ఇస్తామంటే నమ్మొద్దు - ఎన్‌బీఈ హెచ్చరిక

విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసిన విద్యార్థులు భారత్‌లో సేవలందించేందుకు అవసరమయ్యే ‘ఎఫ్‌ఎంజీఈ’ అర్హత పరీక్ష జులై 6న నిర్వహించనున్నారు. అయితే, ఇందుకు సంబంధించి ప్రశ్నాపత్రాన్ని అందజేస్తామని సోషల్‌ మీడియాలో వస్తోన్న ప్రచారాన్ని నమ్మవద్దని నేషనల్‌ బోర్డు ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ వెల్లడించింది.  పూర్తి కథనం

8. నిర్వాహకులదే తప్పిదంగా కనిపిస్తోంది.. హాథ్రస్‌ ఘటనపై సిట్‌ చీఫ్‌

ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌లో భోలే బాబా సత్సంగ్‌ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట (Hathras Stampede) ఘటన 121 మందిని బలిగొంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తన విచారణను వేగవంతం చేసింది. పూర్తి కథనం

9. బ్రిటన్‌ ఎన్నికల్లో భారత సంతతి హవా.. 26 మంది గెలుపు!

బ్రిటన్‌ సార్వత్రిక ఎన్నికల్లో (UK Elections) భాగంగా అక్కడి పార్లమెంటు దిగువ సభ అయిన హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో భారత సంతతి హవా కొనసాగింది. దాదాపు 26 మంది భారత మూలాలున్న అభ్యర్థులు అక్కడి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. పూర్తి కథనం

10. యూకే నూతన ప్రధానిగా కీర్‌ స్టార్మర్‌.. కింగ్ ఛార్లెస్-3 ఆమోదం

పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘనవిజయంతో.. యూకే తదుపరి ప్రధానిగా కీర్‌ స్టార్మర్‌ నియమితులయ్యారు. కింగ్ ఛార్లెస్-3 ఆయన నియామకాన్ని ఆమోదించారు. ఫలితాల అనంతరం స్టార్మర్‌.. బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో రాజును మర్యాదపూర్వకంగా కలిశారు.  పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని