Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...   

Updated : 04 Jul 2024 21:08 IST

1. మేనమామనని చెప్పి చిన్నారుల పొట్ట కొట్టాడా?: అధికారులతో మంత్రి లోకేశ్‌

మధ్యాహ్న భోజన పథకం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలపై మంత్రి నారా లోకేశ్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలు వెలుగులోకి వచ్చాయి. గుడ్లు, చిక్కీల సరఫరా కాంట్రాక్టర్లకు పెద్ద ఎత్తున బకాయిలు ఉన్న విషయాన్ని అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పూర్తి కథనం

2. మోదీవే అసత్య ప్రకటనలు.. చర్యలు తీసుకోండి: కాంగ్రెస్‌

రాజ్యాంగానికి అతిపెద్ద వ్యతిరేకి కాంగ్రెస్‌ పార్టీయేనని, ఇప్పుడు ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు కల్లబొల్లిమాటలు చెబుతోందని ప్రధాని మోదీ (PM Modi) విమర్శించిన నేపథ్యంలో.. కాంగ్రెస్‌ పార్టీ లేఖాస్త్రం సంధించింది. మోదీ, భాజపా ఎంపీ అనురాగ్‌ ఠాకూర్‌ (Anurag Thakur)సత్యదూరమైన ప్రకటనలు చేస్తూ సభను తప్పుదోవ పట్టించారని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మాణికం ఠాగూర్‌ (Manickam Tagore) లేఖ రాశారు. పూర్తి కథనం

3. పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేక పూజలు.. జనసేన కార్యాలయంలో సూర్యారాధన

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సమాజ క్షేమం, దేశ సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ సూర్యారాధన చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం వారాహి దీక్షలో ఉన్న ఆయన గురువారం సూర్యారాధనలో పాల్గొన్నారు. పూర్తి కథనం

4. సీఎం రేవంత్‌రెడ్డి సూచనపై స్పందించిన తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌

సైబర్‌ నేరాలు, డ్రగ్స్‌ కట్టడిపై తెలుగు చలన చిత్ర పరిశ్రమ అవగాహన కల్పించాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సూచనపై తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి (TFCC) స్పందించింది. పూర్తి కథనం

5. త్వరలో జగన్‌ జైలుకు పోక తప్పదు: మంత్రి రామ్‌ప్రసాద్

జగన్‌ మరోసారి జైలుకు పోయే సమయం ఆసన్నమైందని ఏపీ రవాణాశాఖ మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి అన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నెల్లూరులో జగన్‌ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ఐదేళ్లలో జగన్‌ చేసిన పాపాలే అతన్ని వెంటాడుతున్నాయన్నారు.  పూర్తి కథనం

6. సీనియర్‌నేత కేకే నిర్ణయం కాంగ్రెస్‌ పార్టీకి మంచిదే: రేవంత్‌రెడ్డి

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కె.కేశవరావు సేవలను పార్టీ వినియోగించుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా చేయడంపై సీఎం స్పందించారు. కాంగ్రెస్‌ పార్టీకి ఏది మంచిదో అదే నిర్ణయం కేకే తీసుకున్నారన్నారు. పూర్తి కథనం

7. అందుకే భోలే బాబాను ఇంకా అరెస్టు చేయలేదు: పోలీసులు

ఉత్తరప్రదేశ్‌ (Uttarpradesh)లోని హాథ్రస్‌లో జరిగిన సత్సంగ్‌ కార్యక్రమంలో తొక్కిసలాట ఘటన 121 మంది ప్రాణాల్ని బలితీసుకొంది. ఈ దుర్ఘటన అనేక కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.  పూర్తి కథనం

8. సాయం చేయాలంటూ మంచు లక్ష్మి విజ్ఞప్తి.. సోషల్‌ మీడియాలో పోస్ట్‌

వీసా అప్రూవ్‌ అయినా దాన్ని ఇంకా తాను పొందలేదని, ఆ సమస్యకు పరిష్కారం చూపాలంటూ నటి, నిర్మాత మంచు లక్ష్మి (Lakshmi Manchu) సోషల్‌ మీడియా వేదికగా అభిమానులను కోరారు. పూర్తి కథనం

9. ఇజ్రాయెల్‌ పైకి 200 రాకెట్లు.. హెజ్‌బొల్లా ప్రతీకార దాడులు!

ఇజ్రాయెల్‌ (Israel), లెబనాన్‌లోని హెజ్‌బొల్లా (Hezbollah)ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. గ్రూప్‌ సీనియర్‌ కమాండర్‌ మహమ్మద్‌ నామేహ్‌ నజీర్‌ను ఓ వైమానిక దాడిలో ఇజ్రాయెల్‌ హతమార్చిన విషయం తెలిసిందే.  పూర్తి కథనం

10. రష్యాకు ప్రధాని మోదీ.. అయిదేళ్ల తర్వాత తొలిసారి

ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) రష్యా పర్యటన ఖరారైంది. ఈ నెల 8-10వ తేదీల్లో ఆయన రష్యా (Russia)తోపాటు ఆస్ట్రియాలో అధికారిక పర్యటన చేపట్టనున్నట్లు భారత విదేశాంగశాఖ (MEA) ప్రకటించింది. పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని