Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 02 Jul 2024 21:03 IST

1. షారుక్‌ ఖాన్‌కు అరుదైన గౌరవం.. తొలి భారతీయ నటుడిగా

ప్రముఖ నటుడు షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan)కు అరుదైన గౌరవం దక్కింది. లొకర్నో ఫిల్మ్‌ఫెస్టివల్‌ (Locarno Film Festival) జ్యూరీ ఆయన్ను ‘కెరీర్‌ అఛీవ్‌మెంట్‌ అవార్డు’కు ఎంపిక చేసింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టింది.  పూర్తి కథనం

2. ప్రధాని నరేంద్ర మోదీకి రాహుల్‌ గాంధీ లేఖ

ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)కి ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) లేఖ రాశారు. నీట్‌ వ్యవహారం(NEET Row)పై లోక్‌సభలో బుధవారం చర్చ జరిగేలా చూడాలని కోరారు. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా నీట్‌ అంశంపై చర్చకు ప్రధాని మోదీ నాయకత్వం వహిస్తే సముచితంగా ఉంటుందని విశ్వసిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.  పూర్తి కథనం

3. ఎవరీ ‘భోలే బాబా’..? హాథ్రస్‌ తొక్కిసలాటకు కారణమేంటి?

ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌లో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో చోటుచేసుకున్న తొక్కిసలాట తీవ్ర విషాదం నింపింది. ఈ దుర్ఘటనలో 100మందికి పైగా ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయాలపాలవడం దేశాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది.  పూర్తి కథనం

4. ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 11 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. నారాయణపూర్‌ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో 11 మావోయిస్టులు మృతి చెందారు. ఈ విషయాన్ని ఐజీ సుందర్‌రాజ్‌ వెల్లడించారు. ధనంది-కుర్రేవాయ అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుందని ఆయన తెలిపారు.  పూర్తి కథనం

5. ఫేస్‌బుక్‌, వాట్సప్‌ వేదికగా చెలరేగిపోతున్న స్కామర్లు..!

స్కామ్‌.. స్కామ్‌.. స్కామ్‌.. ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పదం ఇది. నిత్యం ఎవరో ఒకరు ఏదో ఒక చోట స్కామ్‌ బారిన పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా పెట్టుబడుల పేరుతో జరుగుతున్న మోసాలు ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి. పూర్తి కథనం

6. గ్రూప్‌ఎం దక్షిణాసియా సీఓఓగా అశ్విన్ పద్మనాభన్‌

డబ్ల్యూపీపీకి చెందిన మీడియా ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ గ్రూప్ఎమ్ దక్షిణాసియా చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా (COO) అశ్విన్‌ పద్మనాభన్‌ నియమితులయ్యారు. ఇన్‌ఫ్లూయెన్సర్‌ మార్కెటింగ్‌ కంటెంట్‌తో పాటు పెట్టుబడులు, వ్యాపారం, భాగస్వామ్యాలు వంటి విభాగాల బాధ్యతలను ఆయన చూస్తారు.  పూర్తి కథనం

7. గూగుల్‌ మ్యాప్స్‌ను నమ్మి.. దట్టమైన అడవిలో 11 గంటలు చిక్కుకొని..

కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు గూగుల్‌ మ్యాప్స్‌ (Google Maps)ను ఉపయోగించి సమస్యల్లో చిక్కుకున్న ఘటనలు తరచూ వింటున్నాం. తాజాగా ఒడిశా (Odisha)లో ఇలాంటి సంఘటనే చోటు చేసుకొంది. ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్లిన కొందరు విద్యార్థులు గూగుల్‌ మ్యాప్స్‌ను నమ్ముకొని దారి తప్పి దట్టమైన అడవిలో చిక్కుకున్నారు.  పూర్తి కథనం

8. ఈపీఎస్‌లో మార్పులు.. 6 నెలల సర్వీసు లేకున్నా విత్‌డ్రా ప్రయోజనాలు

ఉద్యోగుల పింఛను పథకం (EPS), 1995కు సంబంధించి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) కొన్ని సవరణలు చేసింది. ఆరు నెలల కంటే తక్కువ సర్వీసు ఉన్నా ఉపసంహరణ ప్రయోజనాలు కల్పిస్తున్నట్టు పేర్కొంది. దీనివల్ల ఏటా సుమారు 7 లక్షల మందికి ప్రయోజనం కలగనుందని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది.  పూర్తి కథనం

9. త్వరలో వారానికో జిల్లా పర్యటన.. కలెక్టర్లు ఆఫీసు దాటడం లేదు: రేవంత్‌

తెలంగాణ సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. అధికారులు ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ప్రభుత్వ ప్రాధాన్యాతలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. పూర్తి కథనం

10. కాంటాక్టుల్లో పాస్‌వర్డులు.. ఇతరులతో షేరింగ్‌లు.. ఇదీ మన గోప్యత తీరు!

ఫోన్‌, కంప్యూటర్‌, బ్యాంక్‌ అకౌంట్‌.. ఇలా ప్రతి దానికీ ఒక్కో పాస్‌వర్డ్‌ పెట్టుకుంటాం. అందులోని సమాచారం బయటి వ్యక్తులు యాక్సెస్‌ చేయకుండా ఉండేందుకు చేసుకున్న ఏర్పాటు ఇది. కానీ, అలాంటి సున్నితమైన సమాచారం ఎంత వరకు గోప్యంగా ఉంచుతున్నాం? అనే ప్రశ్నకు కొందరి వద్ద సమాధానం ఉండడం లేదు. పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని