Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 30 Jun 2024 09:13 IST

1. విరుచుకుపడుతున్న క్లాసెన్‌ను పెవిలియన్‌కు పంపిన హార్దిక్‌!

దక్షిణాఫ్రికాపై అద్భుత విజయాన్ని నమోదు చేసి టీమ్‌ ఇండియా టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup)ను అందుకుంది. ఒక సమయంలో విధ్వంసకర షాట్లతో విరుచుకుపడుతున్న క్లాసెన్‌ (52).. మ్యాచ్‌ను దక్షిణాఫ్రికాకు అనుకూలంగా మార్చేశాడు. అదే సమయంలో 17వ ఓవర్లో క్లాసెన్‌ను పెవిలియన్‌కు పంపి హార్దిక్‌ భారత్‌ ఆశలకు జీవం పోశాడు. మ్యాచ్‌ను మలుపు తిప్పిన ఆ వికెట్‌ మీరూ చూడండి. పూర్తి కథనం

2. ఈ కప్పెంతో ప్రత్యేకం

వన్డేల్లో కావచ్చు, టీ20ల్లో కావచ్చు.. ప్రపంచకప్‌ వస్తోందంటే అత్యంత భారీ అంచనాలతో బరిలోకి దిగే జట్టు భారతే. క్రికెట్‌ పిచ్చితో ఊగిపోయే మన అభిమానులు జట్టు మీద భారీ ఆశలే పెట్టుకుంటారు. టీమ్‌ఇండియా కూడా టోర్నీని ఘనంగా ఆరంభించి కప్పు గెలిచేలాగే కనిపిస్తుంది. కానీ కీలక దశలో మన వాళ్లు చేతులెత్తేసి ఇంటిముఖం పట్టడం చాలాసార్లు అనుభవమే!పూర్తి కథనం

3. అరచేతిలో ఆట.. ఉపాధికి బాట

మైదానంలో కాళ్లు ఆడించడం తగ్గించేసి ఇప్పుడంతా ఫోన్లలోనే మెరుపు వేగంతో ఆటలు ఆడేస్తున్నారు. సరదాగా ఆడిన ఆటలు కొందరిని గేమర్గా మారేలా చేస్తున్నాయి. లక్షల మందిని దాటుకుని కొందరు గేమర్లు తమ ప్రతిభతో అబ్బురపరుస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో అలాంటి జాతీయ స్థాయి బాటిల్‌ గ్రౌండ్‌ మొబైల్‌ సిరీస్‌ పోటీ జరుగుతోంది.పూర్తి కథనం

4. కట్టు తప్పిన ఖాకీలు..!

అమరావతి: అరాచక శక్తులు పేట్రేగుతుంటే.. పీచమణచాల్సిన పోలీసుల్లో కొందరు వారితో అంటకాగుతున్నారు. న్యాయం కోసం స్టేషన్‌ మెట్లెక్కిన వారి నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. సామాన్యులను బెదిరించి పీల్చి పిప్పి చేస్తున్నారు. కొన్ని స్టేషన్లలో అయితే పాలన పూర్తిగా గాడి తప్పింది.పూర్తి కథనం

5. గోబెల్స్‌ను మించిన మోదీ: నారాయణ

ఖమ్మం మామిళ్లగూడెం: అబద్దాలు చెప్పడంలో ప్రధాని మోదీ గోబెల్స్‌ను మించిపోయాడని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఎద్దేవా చేశారు. ఖమ్మంలో శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వాస్తవికత లేకపోవడంతోనే భాజపా 305 సీట్ల నుంచి 240 స్థానాలకు పడిపోయిందని చెప్పారు. బిహార్, ఏపీ సీఎంలు నీతీశ్‌కుమార్, చంద్రబాబునాయుడిపై ఆధారపడి పరిపాలన సాగించాల్సిన దుస్థితి వచ్చిందని పేర్కొన్నారు.పూర్తి కథనం

6. చెప్పేది శ్రీసిటీ.. చేసేది లూటీ

సత్యవేడు, వరదయ్యపాళెం, న్యూస్‌టుడే: తమిళనాడు-ఆంధ్ర సరిహద్దులోని పారిశ్రామిక నగరం శ్రీసిటీ పేరుతో మట్టి దోపిడీ అక్రమార్కులకు వరంగా మారింది. అధికారం మారినా.. మట్టి అక్రమ రవాణా మాత్రం ఆగలేదు. సత్యవేడు, తడ, సూళ్లూరుపేట ప్రాంతాల్లో శ్రీసిటీ పేరుతో మట్టిరవాణాకు తెరదీశారు.పూర్తి కథనం

7. జీహెచ్‌ఎంసీలో కంటోన్మెంట్‌ విలీనం

ఈనాడు-హైదరాబాద్, కంటోన్మెంట్‌-న్యూస్‌టుడే: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ వాసుల చిరకాల కోరిక నెరవేరింది. కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలోని పౌర(సివిలియన్‌) ప్రాంతాలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కంటోన్మెంట్‌ బోర్డు విలీనంపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపారు.పూర్తి కథనం

8. అరకొర భరణంతో భార్యాబిడ్డలు ఎలా బతుకుతారు?

‘అరకొర సొమ్ము చేతిలో పెట్టి విడాకులు తీసుకుంటే.. రేప్పొద్దున్న భార్య, పిల్లలు ఎలా బతుకుతారు.. ఇదేం పరిష్కారం?’ అని గుంటూరు నాలుగో అదనపు జిల్లా జడ్జి ఆర్‌.శరత్‌బాబు విస్మయం వ్యక్తంచేశారు. గుంటూరు కోర్టులో శనివారం జరిగిన జాతీయ లోక్‌ అదాలత్‌లో ఆయన కుటుంబ న్యాయస్థానానికి చెందిన కేసులను రాజీ మార్గంలో పరిష్కరించారు.పూర్తి కథనం

9. దారి ఇస్తారా.. ఇక్కట్లు కొనసాగిస్తారా?

పదవి ఏదైనా ప్రజాప్రతినిధులు ప్రజాసేవ కోసం ఉపయోగించాలి. జగన్‌ మాత్రం అధికారం అండతో తన నివాసం పరిసరాల వారిని ఇబ్బందులకు గురిచేశారు. జగన్‌ అధికార దుర్వినియోగానికి సంబంధించిన విషయాలన్నీ ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాడేపల్లిలోని తన నివాసం చుట్టూ చేసుకున్న భద్రత ఏర్పాట్లతో పరిసరాల్లో ఉంటున్న ప్రజలకు చుక్కలు చూపించారు.పూర్తి కథనం

10. సరళమా.. సంక్లిష్టమా..?

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలో జులై 1 నుంచి అమలులోకి రాబోతున్న కొత్త న్యాయ చట్టాలతో లాభనష్టాలపై చర్చ జరుగుతోంది. దాదాపు 150 ఏళ్లుగా అమలులో ఉన్న ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపీసీ) స్థానంలో భారతీయ న్యాయసంహిత (బీఎన్‌ఎస్‌), క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సీఆర్పీసీ) స్థానంలో భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌), ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌ (ఐఈఏ) స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం (బీఎస్‌ఏ) రాబోతున్న విషయం  తెలిసిందే.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని