Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 29 Jun 2024 09:02 IST

1. ఆ పోలీసులు.. వైకాపా వీరభక్తులు

వైకాపా పాలనలో కొంతమంది పోలీసు అధికారులు తమ స్వామి భక్తి చాటుకున్నారు. తమ బాధ్యతలను వదిలేసి, వైకాపా నాయకులు ఏం చెప్పినా చేసేందుకు వెనుకడుగు వేయలేదు. కోరిన చోట పోస్టింగ్, పదోన్నతులు, ఇతర బంధుత్వాల నేపథ్యంలో శాంతి భద్రతలు రక్షించాల్సిన రక్షక భటులే ప్రజలకు నరకం చూపించారు. పూర్తి కథనం

2. వచ్చే వారంలో కొలిక్కి!

హైదరాబాద్‌: మంత్రివర్గ విస్తరణ, పీసీసీ నూతన అధ్యక్షుడి ఎంపికపై దిల్లీలో కాంగ్రెస్‌ అధిష్ఠానం కసరత్తు చేస్తుండగా వచ్చే వారంలో తుది నిర్ణయానికి రావొచ్చని తెలుస్తోంది. డిప్యూటీ స్పీకర్, చీఫ్‌ విప్‌ విషయంలో కూడా నిర్ణయం తీసుకోవచ్చని పార్టీ వర్గాల సమాచారం. గురువారం రాత్రి పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ వద్ద జరిగిన సమావేశంలో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడు, డిప్యూటీ స్పీకర్, చీఫ్‌ విప్‌ల ఎంపిక, కార్పొరేషన్‌ ఛైర్మన్ల నియామకం, ఇతర పార్టీల నుంచి వచ్చే ఎమ్మెల్యేలను చేర్చుకోవడం... ఇలా అన్ని అంశాల గురించి కూలంకషంగా చర్చించినట్లు తెలిసింది.పూర్తి కథనం

3. కాసుల మత్తులో ‘దందా’నతాన.. అనుచరుల బార్ల కోసం మద్యం దుకాణాల మార్పు

దశల వారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తామని చెప్పి 2019 ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఈ హామీని జగన్‌ తుంగలో తొక్కారు. ఆదాయం పెంచుకునేందుకు తూట్లు పొడిచారు. తామేం తక్కువ తినలేదని వైకాపా నేతలు వ్యవహరించారు. తమ అనుయాయుల కోసం వైకాపా నేతలు ప్రభుత్వ మద్యం దుకాణాలను ఒక ప్రాంతం నుంచి మరో చోటుకు ఇష్టానుసారం మార్పించారు.పూర్తి కథనం

4. పీసీసీ అధ్యక్ష పదవి ఎవరికిచ్చినా అభ్యంతరం లేదు: జగ్గారెడ్డి

పీసీసీ అధ్యక్ష పదవిని అధిష్ఠానం ఎవరికిచ్చినా తనకు అభ్యంతరం లేదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం గాంధీభవన్‌లో పీసీసీ షిషర్‌మెన్‌ కమిటీ ఛైర్మన్‌ మెట్టు సాయికుమార్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధ్యక్ష పదవికి సంబంధించి తనను ఎవరూ సంప్రదించలేదన్నారు.పూర్తి కథనం

5. చదువుల తల్లికి స్వేచ్ఛ.. ప్రసాదరెడ్డి కబంధ హస్తాల నుంచి ఏయూకి విముక్తి

ఆంధ్ర విశ్వవిద్యాలయానికి విముక్తి కలిగింది. వర్సిటీలోని ఆచార్యులు, ఉద్యోగులు, విద్యార్థులకు స్వేచ్ఛ లభించింది. గత అయిదేళ్ల వైకాపా పాలనలో వీసీ ప్రసాదరెడ్డి ఇష్టారాజ్యంగా తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలతో విశ్రాంత, సీనియర్‌ ఆచార్యులు, ఉద్యోగులు, విద్యార్థులు.. ఇలా ప్రతి ఒక్కరూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు.పూర్తి కథనం

6. ఊదమంటే.. బ్రీత్‌ ఎనలైజర్‌ లాక్కెళ్లాడు!

కంటోన్మెంట్, న్యూస్‌టుడే: డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు చేస్తున్న ట్రాఫిక్‌ పోలీసుల ఏమరుపాటును అదనుగా తీసుకున్న ఓ వాహనదారుడు బ్రీత్‌ ఎనలైజర్‌ను లాక్కుని వెళ్లాడు. బోయిన్‌పల్లి లా అండ్‌ ఆర్డర్‌ ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మీనారాయణరెడ్డి, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగయ్యలు తెలిపిన వివరాల ప్రకారం... ఈ నెల 27న అర్ధరాత్రి దాటాక ట్రాఫిక్‌ పోలీసులు పుల్లారెడ్డి బంగ్లా దాటిన అనంతరం వచ్చే ట్రాఫిక్‌ పాయింట్‌ చౌరస్తాలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు చేస్తున్నారు.పూర్తి కథనం

7. ఈవీఎంలను తప్పుపట్టడం హాస్యాస్పదం: సోము వీర్రాజు 

ఇందిరాగాంధీ హయాం నుంచి కాంగ్రెస్‌ పార్టీ వైఖరి ఏ మాత్రం మారలేదని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు అన్నారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈవీఎం ట్యాంపరింగ్‌ గురించి రాహుల్‌గాంధీ ప్రస్తావించడం, రాష్ట్రంలో కూడా తమకు అనుమానాలున్నాయని ఓడిపోయిన పార్టీ ప్రకటించడం హాస్యాస్పదమన్నారు.పూర్తి కథనం

8. వీడుతున్న చిక్కుముడులు

హైదరాబాద్‌ ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) రెండు భాగాలను ఒకేసారి నిర్మించడానికి అడుగులు పడుతున్నాయి. వేర్వేరుగా కాకుండా ఏకకాలంలో పనులు చేపట్టడమే ఉత్తమమని కేంద్రం చేసిన సూచనకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదాన్ని తెలిపింది.పూర్తి కథనం

9. డబుల్‌ ఎక్సెల్‌ ప్రేమ

ఒకరు ప్రశాంతతకు మారుపేరు... మరొకరు మాటల జలపాతం... ఒకరు టాప్‌ హీరోయిన్‌.. మరొకరు కెరియర్‌లో వెనకబడ్డ హీరో... ఇద్దరి నేపథ్యం సినిమానే. తెరపై ఒక్కసారే ప్రేమ పంచుకున్నా.. తెర వెనక ఏడేళ్లుగా పీకల్దాకా ప్రేమించుకున్నారు. కడదాకా తోడుండాలని ఈమధ్యే పెళ్లితో ఒక్కటయ్యారు. ఆ జంటే సోనాక్షి సిన్హా- జహీర్‌ ఇక్బాల్‌. వాళ్ల ప్రేమ ప్రయాణం కథాకమామీషు ఇది. పూర్తి కథనం

10. రాహుల్‌ మైక్‌ను మ్యూట్‌ చేశారు: కాంగ్రెస్‌

దిల్లీ: లోక్‌సభలో శుక్రవారం ‘నీట్‌ పేపర్‌ లీక్‌’ వ్యవహారాన్ని ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ లేవనెత్తగానే మైక్‌ ఆపేశారని కాంగ్రెస్‌ ఆరోపించింది. ఈ మేరకు ‘ఎక్స్‌’ వేదికగా ఓ వీడియోను షేర్‌ చేసింది. మైక్రోఫోన్‌లో మాట్లాడేందుకు వీలు కల్పించాలంటూ స్పీకర్‌ ఓం బిర్లాను రాహుల్‌ కోరడం ఆ దృశ్యాల్లో కనిపిస్తోంది.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని