Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 03 Jul 2024 09:01 IST

1. ఉపాధ్యాయుల బదిలీలకు ప్రత్యేక చట్టం

రాజకీయ నాయకుల సిఫార్సులు ఉన్నవారికే పైరవీ బదిలీలు.. గత ఎన్నికల ముందు సిఫార్సు బదిలీలతో మాజీ మంత్రి రూ.50 కోట్లకుపైగా దండుకున్న వైనం.. సాధారణ ఉపాధ్యాయుల పరిస్థితి అగమ్యగోచరం.. ఇలాంటి విధానంలో మార్పులు తెచ్చేందుకు ప్రభుత్వం బదిలీల చట్టాన్ని తీసుకురావాలని భావిస్తోంది. పూర్తి కథనం

2. మల్‌రెడ్డి.. దానం.. ఎవరో ఒకరికి స్థానం!

కొద్దిరోజుల్లో జరిగే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో రాజధానికి ప్రాతినిధ్యం లభించబోతోందని తెలుస్తోంది. కాంగ్రెస్‌ వర్గాలూ ఇదే స్పష్టం చేస్తున్నాయి. ఈ వారంలో మంత్రివర్గ విస్తరణకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిద్ధమవుతున్నారు. ప్రస్తుత మంత్రివర్గంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలకు స్థానం లభించలేదు.పూర్తి కథనం

3. విశాఖ జైల్లో గంజాయి ఖైదీలే ఎక్కువ

విశాఖ జైల్లో 2 వేల మంది ఖైదీలు ఉండగా.. వారిలో 1,200 మంది గంజాయి ఖైదీలే ఉండటం విచారకరమని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. గంజాయి నియంత్రణకు ఐదుగురు మంత్రులతో కేబినెట్‌ సబ్‌కమిటీ ఏర్పాటు చేశామని, రెండు రోజుల్లో సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.పూర్తి కథనం

4. ఆగస్టు 15 నుంచి వందే భారత్‌ స్లీపర్‌.. సికింద్రాబాద్‌, కాచిగూడ నుంచి నడపాలని ప్రతిపాదన

కొత్తగా వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లు ఆగస్టు 15న ప్రారంభం కానున్నాయి. వీటిని కాచిగూడ, సికింద్రాబాద్‌ స్టేషన్ల నుంచి నడపాలని ద.మ రైల్వే అధికారులు ప్రతిపాదించారు. ఇప్పటికే కాచిగూడ-బెంగళూర్, సికింద్రాబాద్‌-విశాఖ-సికింద్రాబాద్, సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య వందే భారత్‌ ఛైర్‌కార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడుస్తున్నాయి. పూర్తి కథనం

5. డబ్బులిచ్చి పోస్టింగ్‌కు ప్రయత్నిస్తే వేటు తప్పదు

హైదరాబాద్‌: డబ్బులిచ్చి కోరుకున్న పోస్టింగ్‌ తెచ్చుకునేందుకు ప్రయత్నించే పోలీసులపై వేటు తప్పదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. అలాంటివారిని ఎవరూ కాపాడలేరని.. ఏసీబీ, విజిలెన్స్‌ వెంటాడుతాయని స్పష్టంచేశారు. విధినిర్వహణలో సామర్థ్యం, ప్రతిభ కనబరిచేవారికే పోస్టింగ్‌లలో, బదిలీల్లో ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఐపీఎస్‌ సందీప్‌ శాండిల్య పదవీకాలం పొడిగించడమే ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు.పూర్తి కథనం

6. సూపర్‌ పరిజ్ఞానాలు

సాంకేతిక పరిజ్ఞాన (టెక్నాలజీ) రంగం శరవేగంగా సాగుతోంది. నిన్నటి పద్ధతులు నేడు పాత పడిపోతున్నాయి. వాటి స్థానంలో వినూత్న పరిజ్ఞానాలు వచ్చి చేరుతున్నాయి. వీటి ప్రాముఖ్యతను, ప్రభావాన్ని గుర్తించటం ఎంతైనా అవసరం. దీన్ని దృష్టిలో పెట్టుకునే వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ తాజాగా ‘టాప్‌ టెన్‌ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ ఆఫ్‌ 2024’ నివేదికను విడుదల చేసింది.పూర్తి కథనం

7. బర్డ్‌ వాచింగ్‌.. నైట్‌ క్యాంపింగ్‌.. మధ్యలో బోటింగ్‌!

పచ్చని చెట్లు.. చుట్టూ ఎత్తైన కొండలు.. చెంతనే గలగల ప్రవాహాలు.. అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం మధ్యలో.. చలిమంటలు కాగుతూ స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తుంటే.. ఆ ఆనంద పారవశ్యమే వేరు కదూ..! ఇలాంటి అనుభూతినే కల్పించి పర్యాటకులను కట్టిపడేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.పూర్తి కథనం

8. బడి బువ్వ బాలేదు

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నభోజనం ‘రుచి’ తప్పింది. బడిలో భోజనం చేసే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. హాజరైన వారందరికీ భోజనం వండుతున్నా చాలామంది తినడం లేదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీస్తోంది. గొప్ప మెనూ అమలు చేస్తున్నాం.. పిల్లలకు రుచికరమైన పౌష్టికాహారం అందిస్తున్నామంటూ.. గత ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం గొప్పలు పోయింది. పూర్తి కథనం

9. ఖాతాదారు డబ్బు మాయం... యూనియన్‌ బ్యాంకుకు జరిమానా

హైదరాబాద్‌: ఖాతాదారుడికి అందించాల్సిన సేవల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన యూనియన్‌ బ్యాంకుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌ జరిమానా విధించింది. ఖాతాదారు పోగొట్టుకున్న రూ.15,000, 9శాతం వడ్డీతో చెల్లించడంతో పాటు రూ.5వేలు పరిహారం, రూ.2వేలు కేసు ఖర్చులు చెల్లించాలని ఆదేశించింది. పూర్తి కథనం

10. ఆరుపలకల దేహం.. స్టెరాయిడ్స్‌తో ఆగమాగం!

అందమైన దేహం.. ఆకట్టుకునే రూపం ఆతృతలో కొందరు తప్పటడుగులు వేస్తున్నారు. యువకుల ఆసక్తిని అవకాశంగా కొన్ని జిమ్‌ సెంటర్లు స్టెరాయిడ్స్‌ను అలవాటు చేస్తున్నాయి. అడ్డు చెప్పాల్సిన కోచ్‌లు కమీషన్‌పై ఆశతో తలలూపుతున్నారు. ఇటీవల చాంద్రాయణగుట్ట, ఆసిఫ్‌నగర్, మెహిదీపట్నం పరిధిలో పోలీసులు నిషేధిత ఇంజక్షన్లు, మాత్రలు విక్రయిస్తున్న ఇద్దర్ని అరెస్టు చేశారు.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు