Top 10 News 5PM: ఈనాడు.నెట్‌ టాప్‌ 10 న్యూస్‌ @ 5PM

ఈనాడు.నెట్‌లో ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... 

Published : 01 Jul 2024 17:01 IST

1. మోదీ అంతరిక్షంలోకి వెళ్లగలరా? - ఇస్రో చీఫ్‌ ఏమన్నారంటే!

అంతరిక్షంలోకి మానవులను తీసుకెళ్లే ‘గగన్‌యాన్‌’ మిషన్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అక్కడికి వెళ్లవచ్చని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ పేర్కొన్నారు. మన ప్రభుత్వాధినేతను అంతరిక్షంలోకి పంపించగలిగే శక్తిసామర్థ్యాలు పొందగలిగితే మనందరికీ ఎంతో గర్వకారణమని అన్నారు. గగన్‌యాన్‌కు సంబంధించి ఓ జాతీయ వార్తా ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. మిషన్‌కు సంబంధించి తాజా సమాచారాన్ని వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. విద్యార్థుల ఆస్ట్రేలియా కల మరింత భారం..!

 విద్యార్థులకు ఆస్ట్రేలియా(Australia)లో చదువులు మరింత భారంగా మారనున్నాయి. ఇతర దేశాల నుంచి అక్కడికి వెళ్లి చదువుకొనే విద్యార్థులు చెల్లించాల్సిన ఫీజులను ఆ దేశం భారీగా పెంచేసింది. గతంలో 473 అమెరికన్‌ డాలర్లుగా ఉన్న ఫీజును ఇప్పుడు 1,068 డాలర్లకు పెంచింది. జులై 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి వచ్చింది. వలసలను బలవంతంగా నియంత్రించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. మన అమ్మాయిలూ గెలిచేశారు!

దక్షిణాఫ్రికాతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సోమవారం రెండో ఇన్నింగ్స్‌ (ఫాలోఆన్‌)ను 232/2 స్కోరుతో ఆరంభించిన దక్షిణాఫ్రికా.. 373 పరుగులకు ఆలౌటై భారత్‌కు 37 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ టార్గెట్‌ని టీమ్‌ఇండియా 9.2 ఓవర్లలో పూర్తి చేసింది. షఫాలీ వర్మ (24*), శుభా సతీష్ (13) పరుగులు చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. జులై 4న దిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జులై 4న దిల్లీకి వెళ్లనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన హస్తిన పర్యటనకు వెళ్తున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ సహా పలువురు నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేంద్రం ప్రవేశ పెట్టబోయే బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులు, కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి గతంలో రావాల్సిన నిధులు, కొత్తగా తెచ్చుకోవాల్సిన పథకాలపై నిర్మలా సీతారామన్‌తో చర్చించే అవకాశం ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. సమాచారం కావాలంటే.. ఇక వాట్సప్‌లో సెర్చ్‌ చేయొచ్చు!

ఫ్రెండ్స్‌తో పిచ్చాపాటిగా మాట్లాడుతుంటాం.. ఇంతలో తెలీని ఏదో అంశం గురించి చర్చ. వెంటనే దానికోసం వాట్సప్‌ ఓపెన్‌ చేస్తే చాలు. క్షణాల్లో ఆ సమాచారం మీ ముందుంటుంది. ఇందుకోసం వాట్సప్‌ మాతృసంస్థ మెటా.. మెటా ఏఐని (Meta AI) తీసుకొచ్చింది. ఇంతకీ ఏమిటీ మెటా ఏఐ. దీంతో ఏమేం చేయొచ్చు..? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. యుద్ధం చేస్తామంటే విడుదల చేస్తాం.. ఖైదీలకు ఆఫర్‌

దాదాపు రెండున్నరేళ్లుగా రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్‌ (Ukraine).. యుద్ధ భూమిలో తీవ్రమైన సిబ్బంది కొరతను ఎదుర్కొంటోంది. సైన్యాన్ని పటిష్టం చేసేందుకు ముమ్మరంగా నియామకాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే తొలిసారిగా జైల్లోని ఖైదీల (Prisoners)నూ మిలటరీలోకి తీసుకునేందుకు సిద్ధమైంది. ఇందుకోసం వారికి ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు చేస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. ధన్‌ఖడ్‌, ఖర్గే సంభాషణ.. సభలో నవ్వులే నవ్వులు!

పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు కొనసాగుతున్నాయి. అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగడం సాధారణంగా చూస్తుంటాం. ఈక్రమంలో రాజ్యసభలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకొంది. రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ (Jagdeep Dhankhar), కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge)ల మధ్య వాడీవేడి సంభాషణ జరిగిన రెండురోజులకే వారి మధ్య చోటుచేసుకున్న సరదా సంభాషణతో సభలో నవ్వులు విరిసాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. ఇక నిరుద్యోగిని.. ఏమైనా ఉద్యోగాలున్నాయా?: ద్రవిడ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు 

భారత జట్టుకు పొట్టి ప్రపంచకప్‌ను అందించి కోచ్ పదవిని ఘనంగా ముగించాడు రాహుల్ ద్రవిడ్‌ (Rahul Dravid). ఎప్పుడూ గంభీరంగా కన్పించే అతడు.. ఫైనల్‌లో టీమ్‌ఇండియా (Team India) గెలవగానే ఇతర ఆటగాళ్లతో కలిసి చిన్నపిల్లాడిలా మారిపోయాడు. జట్టుతో కలిసి సంబరాలు చేసుకున్నాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇక నిరుద్యోగిని.. ఏమైనా ఉద్యోగాలుంటే చెప్పండి’ అంటూ సరదాగా అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. ఐపీఓకు నివా బుపా హెల్త్‌ ఇన్సూరెన్స్‌.. రూ.3వేల కోట్ల సమీకరణ

ప్రముఖ బీమా సంస్థ ‘నివా బుపా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌’ ఐపీఓకి (Niva Bupa Health Insurance IPO) రాబోతోంది. ఈమేరకు సెబీ ఆమోదం కోరుతూ ప్రాథమిక పత్రాలు సమర్పించింది. దాదాపు రూ.3,000 కోట్ల నిధులు సమీకరించే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. ప్రతిపాదిత ఐపీఓలో (IPO) రూ.800 కోట్లు విలువ చేసే కొత్త షేర్లను జారీ చేయాలనుకుంటున్నట్లు నివా బుపా తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ నుంచి మాస్‌ సాంగ్‌ ‘స్టెప్‌ మార్‌’ వచ్చేసింది

రామ్‌ కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ (Double ISMART). కావ్య థాపర్ కథానాయిక. సంజయ్‌ దత్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ మూవీలోని ‘స్టెప్‌ మార్‌’ అంటూ సాగే లిరికల్‌ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని