Music Academy: కర్ణాటక సంగీతంలో మూడేళ్ల కోర్సుకు మద్రాస్‌ మ్యూజిక్‌ అకాడమీ దరఖాస్తుల ఆహ్వానం

కర్ణాటక సంగీతంలో అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా కోర్సు కోసం మద్రాస్‌ మ్యూజిక్‌ అకాడమీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

Published : 03 Jun 2024 18:00 IST

చెన్నై: కర్ణాటక సంగీతంలో అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా కోర్సు కోసం మద్రాస్‌ మ్యూజిక్‌ అకాడమీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగినవారు జూన్‌ 25వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మూడేళ్ల వ్యవధి కలిగిన ఈ కోర్సులో ఏటా రెండు సెమిస్టర్లు ఉంటాయి. తరగతులు జులైలో ప్రారంభించనున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల మధ్య తరగతులు నిర్వహిస్తారు. ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకొనేందుకు ఇంటర్‌ ఉత్తీర్ణతతో పాటు 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్కులు అర్హులు. సంగీతంలోని వర్ణాలు, కృతులు పాడగలగాలి.

ఈ కోర్సు కోసం దరఖాస్తులు మ్యూజిక్‌ అకాడమీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు తమ బయోడేటాతో పాటు సంగీత శిక్షణకు సంబంధించిన వివరాలను ఈ-మెయిల్‌ చేయాలని అధికారులు పేర్కొన్నారు. మద్రాస్‌ మ్యూజిక్‌ అకాడమీ ఆధ్వర్యంలో 2010లో ఏర్పాటైన అడ్వాన్స్‌డ్‌ స్కూల్‌ ఆఫ్‌ కర్ణాటిక్‌ మ్యూజిక్‌ సంస్థ సంగీతంలో విద్యార్థులకు ఉన్నత స్థాయి నైపుణ్యాలు అందించేందుకు శిక్షణ ఇస్తోంది. సంగీతంలో దిగ్గజాల నుంచి నేర్చుకోవడంతో పాటు వేదికలపై ప్రదర్శన ఇవ్వగలిగే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తోంది. మరింత సమాచారం కోసం www.musicacademymadras.in సందర్శించవచ్చు. లేదా 044-28112231/ 28116902/ 28115162 ఫోన్‌ నంబర్లను సంప్రదించవచ్చని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు