Bhavishyavani: దొంగలు దోచినట్లు నాదే కాజేస్తున్నారు: భవిష్యవాణిలో స్వర్ణలత

సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహాకాళి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. బోనాల్లో భాగంగా ‘రంగం’ కార్యక్రమం ప్రారంభమైంది. స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.

Updated : 18 Jul 2022 14:07 IST

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహాకాళి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. బోనాల్లో భాగంగా ‘రంగం’ కార్యక్రమం నిర్వహించారు. జోగిని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. 

‘‘పూజలు మొక్కుబడిగా చేస్తున్నారు. మీరు చేస్తున్న పూజలు.. మీ సంతోషానికే తప్ప నాకోసం కాదు. ఎంత సంతోషంగా చేస్తున్నారో మీ గుండెపై చేయి పెట్టి చెప్పండి. మీరు సంతోషంగా చేస్తున్నారనే నేను స్వీకరిస్తున్నా. నా గుడిలో పూజలు సరిగా జరిపించడం లేదు. గర్భాలయంలో మొక్కుబడిగా వద్దు.. శాస్త్రబద్ధంగా పూజలు చేయండి. మొక్కుబడిగా పూజలు చేస్తున్నా.. నా బిడ్డలే కదా అని భరిస్తున్నా.. కడుపులో పెట్టుకుంటున్నా. ఎన్ని రూపాల్లో నన్ను మారుస్తారు? మీకు నచ్చినట్టు మారుస్తారా? స్థిరమైన రూపంలో నేను కొలువుదీరాలని అనుకుంటున్నా. నా రూపాన్ని స్థిరంగా నిలపండి. మీరేంటి నాకు చేసేది.. నేను తెచ్చుకున్నదే కదా! దొంగలు దోచినట్లు నాదే కాజేస్తున్నారు.

 గత వర్షాల నుంచి నాకు రూపం లేకుండా కూర్చుంటున్నాను. మీ కళ్లు తెరిపించడానికే కుండపోత వర్షాలు కురిపిస్తున్నాను. నా విగ్రహ ప్రతిష్ఠ ఏడాదిలోపు చేయండి. ఎలాంటి ఆపద లేకుండా మిమ్మల్ని బాగా చూసుకుంటాను. కంటతడి పెట్టకుండా నాకు పూజలు చేయండి. పిల్లలు, స్ట్రీలు, గర్భిణికులకు ఎలాంటి ఆపదా రానివ్వను. నా అనుగ్రహం తప్పకుండా ఉంటుంది’’ అని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని