Janmabhoomi express: ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ పునరుద్ధరణ

Janmabhoomi express: జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను దక్షిణ మధ్య రైల్వే పునరుద్ధరించింది. జూన్‌ 25 నుంచి యథావిధిగా నడవనుంది.

Published : 24 Jun 2024 17:48 IST

Janmabhoomi express | సికింద్రాబాద్‌: విజయవాడ డివిజన్‌లో ఆధునికీకరణ పనుల కారణంగా రద్దు చేసిన రైళ్లలో కొన్నింటిని దక్షిణ మధ్య రైల్వే (South central railways) పునరుద్ధరించింది. జన్మభూమి, విజయవాడ- కాకినాడ పోర్ట్‌ రైళ్లను ప్రయాణికులకు మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చింది. నిడదవోలు-కడియం మధ్య ఆధునికీకరణ పనుల కారణంగా జూన్‌ 23 నుంచి ఆగస్టు 11 వరకు పలు రైళ్లను ఇటీవల రద్దు చేసిన సంగతి తెలిసిందే. వీటిలో జన్మభూమి, రత్నాచల్‌, సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ వంటిరైళ్లు ఉన్నాయి. దీంతో ప్రయాణికుల నుంచి ఆందోళన వ్యక్తమైంది. ఈ క్రమంలో విశాఖ- లింగంపల్లి (12805) మధ్య నడిచే జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను జూన్‌ 25 నుంచి యథావిధిగా నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దీంతో పాటు విజయవాడ- కాకినాడ పోర్టు (17257); చెంగల్పట్టు- కాకినాడ పోర్ట్‌ (17643) మధ్య నడిచే రైళ్లను సైతం పునరుద్ధరించినట్లు పేర్కొంది. వీటితో పాటు రద్దీని తగ్గించేందుకు తీసుకొచ్చిన పలు ప్రత్యేక రైళ్లను మరింత కాలం పాటు నడపునున్నట్లు వెల్లడించింది. పట్టికలో ఆ వివరాలు చూడొచ్చు..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు