Rain: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి వర్షం కురిసింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

Published : 02 Jul 2024 22:59 IST

హైదరాబాద్‌: నగరంలోని పలు చోట్ల మంగళవారం రాత్రి వర్షం కురిసింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, ఆల్విన్‌కాలనీ, నిజాంపేట, బాచుపల్లి, ప్రగతినగర్‌, మియాపూర్‌, చందానగర్‌, లింగంపల్లి, కొండాపూర్‌, మాదాపూర్, అమీర్‌పేట, పంజాగుట్ట, బోరబండ, యూసప్‌గూడ, ఎస్సార్‌నగర్‌, కుత్బుల్లాపూర్‌, బాలానగర్‌, చింతల్‌, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, సుచిత్ర, కొంపల్లి, పేట్‌ బషీరాబాద్‌, సూరారం, బహదూర్‌పల్లి, తార్నాక, ఓయూ, లాలాపేట, హబ్బిగూడ, నాచారం, మల్లాపూర్‌, చాదర్‌ఘాట్‌, మలక్‌పేట, సైదాబాద్‌, చంపాపేట, అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనచోదకులు ఇబ్బంది పడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని