Rain: హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం.. స్తంభించిన ట్రాఫిక్‌

నగరంలోని పలు చోట్ల శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

Published : 05 Jul 2024 19:10 IST

హైదరాబాద్‌: నగరంలోని పలు చోట్ల శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. చాదర్‌ఘాట్‌, మలక్‌పేట్‌, సైదాబాద్‌, చంపాపేట్‌, కర్మన్‌ఘాట్‌, దిల్‌సుఖ్‌నగర్‌, సరూర్‌నగర్‌, చైతన్యపురి, కొత్తపేట తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనచోదకులు ఇబ్బంది పడ్డారు. పలుచోట్ల ట్రాఫిక్‌ స్తంభించింది. వర్షసూచన దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు వెళ్లాలని అధికారులు సూచించారు.

మరో 3 రోజులు వానలే..

రానున్న 3 రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. శుక్రవారం, శనివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. ఈ మేరకు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్టు వివరించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం కురిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని