Rain: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం.. అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ

నగరంలోని పలు చోట్ల గురువారం సాయంత్రం  భారీ వర్షం కురిసింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

Updated : 27 Jun 2024 20:19 IST

హైదరాబాద్‌: నగరంలోని పలు చోట్ల గురువారం సాయంత్రం  భారీ వర్షం కురిసింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, నిజాంపేట్‌, ప్రగతినగర్‌, బోరబండ, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్‌, మైత్రీవనం, అమీర్‌పేట, పంజాగుట్ట, రామంతాపూర్‌, ఉప్పల్‌, దిల్‌షుక్‌నగర్‌, ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనచోదకులు ఇబ్బంది పడ్డారు. వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని