Srisailam Temple: మొరాయించిన శ్రీశైలం దేవస్థానం వెబ్‌సైట్‌.. నిలిచిన ఆన్‌లైన్‌ టికెట్ల జారీ

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానం వెబ్‌సైట్‌ మొరాయించింది. ఆదివారం సాయంత్రం నుంచి ఆలయ వెబ్‌సైట్‌ పనిచేయడం లేదు.

Published : 01 Jul 2024 10:52 IST

శ్రీశైలం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానం వెబ్‌సైట్‌ మొరాయించింది. ఆదివారం సాయంత్రం నుంచి ఆలయ వెబ్‌సైట్‌ పనిచేయడం లేదు. సాంకేతిక సమస్యలతో ఆన్‌లైన్‌ టికెట్ల జారీ నిలిచిపోయింది. దీంతో ఆలయ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. మాన్యువల్‌ దర్శనం టికెట్లను జారీ చేశారు. సాంకేతిక సమస్యలతో ఆర్జిత సేవా టికెట్లు అందుబాటులోకి రాలేదు. దీంతో భక్తులు ఆర్జిత సేవలు, అభిషేకం, కుంకుమార్చన సేవలు నిర్వహించలేకపోతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు