TG News: తెలంగాణలో ఉద్యోగుల సాధారణ బదిలీలకు అనుమతి

తెలంగాణలో ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం అనుమతిచ్చింది.

Updated : 03 Jul 2024 19:39 IST

హైదరాబాద్‌: ఉద్యోగుల సాధారణ బదిలీలకు తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు బదిలీలపై కొనసాగుతున్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్థికశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జులై 5 నుంచి 20 వరకు బదిలీల షెడ్యూలు ప్రకటించింది. ఈ ఏడాది జూన్ 30 నాటికి ఒకే చోట నాలుగేళ్లుగా పనిచేస్తో్న్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయన్నట్టు వెల్లడించింది. రెండేళ్లు కూడా పూర్తి కాని ఉద్యోగులను బదిలీ చేయరాదని జీవోలో పేర్కొన్నారు. కౌన్సెలింగ్‌ ద్వారా ఉద్యోగులను బదిలీ చేయనున్న ప్రభుత్వం.. వితంతువులు, స్పౌజ్‌,  అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రాధాన్యమివ్వనున్నారు.

వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ఉద్యోగుల ఆప్షన్లను స్వీకరించి బదిలీలు చేయనున్నారు. జులై 5 నుంచి 8 వరకు ఉద్యోగ సంఘాలతో చర్చించి ఖాళీలు, కచ్చితంగా బదిలీ చేయాల్సిన ఉద్యోగుల వివరాలను వెల్లడిస్తారు. 9 నుంచి 12వ తేదీ వరకు ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరిస్తారు. జులై 13  నుంచి 18 వరకు ఉద్యోగుల బదిలీల దరఖాస్తుల పరిశీలించి..  19, 20 తేదీల్లో ఉద్యోగుల బదిలీల ఉత్తర్వుల జారీ చేస్తారు. 21 నుంచి ఉద్యోగుల సాధారణ బదిలీలపై మళ్లీ నిషేధం అమల్లోకి వస్తుందని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణరావు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని