ప్రొద్దుటూరులో పింఛను డబ్బు మాయం.. ఘటనపై పోలీసుల అనుమానం!

వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు ఏడో వార్డు సచివాలయం పరిధిలో పింఛను డబ్బు మాయమైంది.

Published : 01 Jul 2024 13:19 IST

ప్రొద్దుటూరు నేరవార్తలు: వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు ఏడో వార్డు సచివాలయం పరిధిలో పింఛను డబ్బు మాయమైంది. దుండగులు తన వద్ద నుంచి డబ్బు దోచుకెళ్లినట్లు సచివాలయ కార్యదర్శి మురళి తెలిపారు. సోమవారం ఉదయం పింఛను డబ్బు పంపిణీ చేసేందుకు వెళ్తుండగా స్పృహ తప్పి బైక్ పైనుంచి కింద పడిపోయానని..  ఈ క్రమంలో తన వద్ద ఉన్న రూ.4 లక్షలు ఎత్తుకెళ్లారని చెబుతున్నారు. అతడిని ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. పింఛను డబ్బు మాయం కావడంపై పోలీసులు, పురపాలక అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని