Kaleshwaram: పీసీ ఘోష్‌ కమిషన్‌ విచారణ గడువు పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు

కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్‌ గడువును మరో రెండు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Updated : 29 Jun 2024 15:22 IST

హైదరాబాద్‌: కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్‌ గడువును మరో రెండు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, బ్యారేజీలపై విచారణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పీసీ ఘోష్‌ నేతృత్వంలో ప్రభుత్వం కమిషన్‌ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నెలతో పీసీ ఘోష్‌ కమిషన్‌ గడువు పూర్తికానుంది. విచారణ కొనసాగుతోన్న నేపథ్యంలో గడువును ఆగస్టు 31 వరకు పొడిగించింది.   

కమిషన్‌ ముందు విచారణకు హాజరైన ప్రాజెక్టుకు సంబంధించిన మాజీ ఈఎన్సీలు, ప్రస్తుత ఈఎన్సీలు, సీఈలు, ఇతర ఇంజినీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను పూర్తి వివరాలతో అఫిడవిట్లు దాఖలు చేయాలని ఈ నెల మొదటి వారంలో నిర్వహించిన విచారణ సందర్భంగా జస్టిస్‌ పీసీ ఘోష్‌ ఆదేశించారు. దీంతో గురువారం వరకు 60 మంది సీల్డ్‌ కవర్లలో అఫిడవిట్లు దాఖలు చేసినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని