Pawan Kalyan: అమరావతిలో రామోజీరావు విగ్రహం ఏర్పాటు చేయాలి: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

ప్రజా సమస్యల పరిష్కారానికి రామోజీరావు రాజీలేని పోరాటం చేశారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ అన్నారు.

Updated : 27 Jun 2024 20:46 IST

విజయవాడ: ప్రజా సమస్యల పరిష్కారానికి రామోజీరావు రాజీలేని పోరాటం చేశారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, పద్మవిభూషణ్‌ అవార్డు గ్రహీత రామోజీరావు (Ramoji Rao) సంస్మరణ సభకు పలువురు పాత్రికేయ, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. విజయవాడ శివారు కానూరులోని అనుమోలు గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, రామోజీరావు కుటుంబ సభ్యులు, ప్రముఖ పాత్రికేయులు, రాష్ట్ర మంత్రులు, సినీ ప్రముఖులు హాజరై పుష్పాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ...‘‘ 2008లో మొదటి సారి రామోజీరావును కలిశా. ఆయన మాట్లాడే విధానం నన్ను చాలా ఆకర్షించింది. ప్రజా సంక్షేమం కోణంలోనే ఎప్పుడూ మాట్లాడేవారు. రామోజీరావు మాటల్లో జర్నలిజం విలువలే నాకు కనిపించాయి. పత్రికా స్వేచ్ఛ ఎంత అవసరమో ఆయన వివరించారు. ప్రభుత్వంలో ఏం జరిగినా ప్రజలకు తెలియాలని అనేవారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజా సమస్యల గురించే పత్రికలో రాసేవారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరూ కృషి చేయాలనేవారు. ఎన్ని కష్టాలు వచ్చినా జర్నలిజం విలువలు వదల్లేదు. అమరావతిలో రామోజీరావు విగ్రహం ఏర్పాటు చేయాలి’’ అని పవన్ కల్యాణ్ సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని