Pawan Kalyan: జల్‌జీవన్‌ మిషన్‌ గ్రాంట్‌ వివరాలివ్వండి.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్‌ ఆదేశం

జల్‌జీవన్‌ మిషన్‌లాంటి కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులకు సంబంధించి రాష్ట్ర మ్యాచింగ్‌ గ్రాంట్‌ వివరాలు ఇవ్వాలని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అధికారులను ఆదేశించారు.

Published : 27 Jun 2024 15:33 IST

విజయవాడ: జల్‌జీవన్‌ మిషన్‌లాంటి కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంట్‌ వివరాలు ఇవ్వాలని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం ఈ పథకం నిధులను వినియోగించుకోలేకపోయిందని వ్యాఖ్యానించారు. గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ విభాగాల అధికారులతో ఆయన గురువారం సమీక్ష నిర్వహించారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమావేశమైన డిప్యూటీ సీఎం.. తాగునీటి సరఫరాలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇటీవల డయేరియా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. తాగు నీటి సౌకర్యం లేని గ్రామాలపై దృష్టి పెట్టాలని, జల్‌జీవన్‌ మిషన్‌ పథకం నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని