Andhra news: ఏపీలో సంక్షేమ పథకాలకు మళ్లీ ఒకప్పటి పేర్లు

ఆంధ్రప్రదేశ్‌లో పలు సంక్షేమ పథకాల పేర్లను మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్వర్వులు వెలువరించింది.

Updated : 18 Jun 2024 18:55 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పలు సంక్షేమ పథకాల పేర్లను మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్వర్వులు వెలువరించింది. 2019లో వైకాపా అధికారంలోకి రాగానే తెదేపా హయాంలో అమలైన పథకాల పేర్లు మార్చింది. జగనన్న, వైఎస్సార్‌ పేర్లతో అమలు చేసింది. తాజాగా పూర్వపు పేర్లనే మళ్లీ తీసుకొస్తూ సాంఘిక సంక్షేమ శాఖ జీవో విడుదల చేసింది. ఆ మేరకు వెబ్‌సైట్లు, ఇతర చోట్ల మార్పులు చేయాలని ఆదేశించింది.

మారిన పథకాల పేర్లివే..

జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ఇకపై పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌
జగనన్న విదేశీ విద్యా దీవెన .. అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి
వైఎస్సార్‌ కల్యాణమస్తు .. చంద్రన్న పెళ్లికానుక
వైఎస్సార్‌ విద్యోన్నతి.. ఎన్టీఆర్‌ విద్యోన్నతి
జగనన్న సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకం.. ఇన్సెంటివ్స్‌ ఫర్‌ సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు