Polavaram: పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు

ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి పోలవరం ప్రాజెక్టును అంతర్జాతీయ జలవనరుల నిపుణులు పరిశీలించారు. అమెరికా, కెనడా నుంచి వచ్చిన నలుగురు నిపుణులు.. ఆదివారం ఉదయం ప్రాజెక్టు వద్దకు చేరుకుని అక్కడి పరిసరాలను పరిశీలించి అధికారులతో మాట్లాడారు.

Published : 30 Jun 2024 11:58 IST

పోలవరం: ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి పోలవరం ప్రాజెక్టును అంతర్జాతీయ జలవనరుల నిపుణులు పరిశీలించారు. అమెరికా, కెనడా నుంచి వచ్చిన నలుగురు నిపుణులు.. ఆదివారం ఉదయం ప్రాజెక్టు వద్దకు చేరుకుని అక్కడి పరిసరాలను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. అమెరికా నుంచి డేవిడ్ పి పాల్, గెయిన్ ఫ్రాంకో డి సిక్కో, కెనడా నుంచి రిచర్డ్ డానెల్లీ, సీన్ హించ్ బెర్గర్‌ హాజరయ్యారు.

డయాఫ్రం వాల్, రెండు కాఫర్ డ్యాంలు, గైడ్ బండ్‌లను నిపుణులు పరిశీలించనున్నారు. ప్రాజెక్టు డిజైన్ల నుంచి నేటి పరిస్థితి వరకు సమగ్ర అధ్యయనం చేయనున్నారు.  నేటి నుంచి జులై 3వరకు ప్రాజెక్టు సైట్‌లో పనులను నిపుణులు పరిశీలిస్తారు. అనంతరం కేంద్ర, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థలతో కలిసి సమీక్ష నిర్వహించనున్నారు. గత 5 ఏళ్ల తప్పుడు నిర్ణయాల కారణంగా అసలు పోలవరంలో ఎంత నష్టం జరిగిందో కూడా చెప్పలేని స్థాయిలో ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అంతర్జాతీయ నిపుణులను రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దింపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని