Andhra news: ఒకటో తేదీనే 90 శాతం పింఛన్లు పంపిణీ చేయాలి: ఏపీ సీఎస్‌

జులై ఒకటో తేదీనే 90 శాతం పింఛన్లు పంపిణీ చేయాలని ఏపీ సీఎస్‌ నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

Updated : 29 Jun 2024 19:37 IST

అమరావతి: జులై ఒకటో తేదీనే 90 శాతం పింఛన్లు పంపిణీ చేయాలని ఏపీ సీఎస్‌ నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయం నుంచి ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీపై ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ‘‘జులై 1న 65,18,496 మందికి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందజేయాలి. ఇందుకోసం రూ.4,399.89 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. పింఛన్ల పంపిణీ నిమిత్తం ఇతర ప్రభుత్వ విభాగాల సేవలను వినియోగించుకునేందుకు జిల్లా కలెక్టర్లు ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లకు అవసరమైన ఆదేశాలు జారీ చేయాలి. 

పింఛన్ల పంపిణీ ప్రక్రియను కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలి. సోమవారం ఉదయం 6 గంటల కల్లా పింఛన్ల పంపిణీ ప్రారంభం కావాలి. జులై 1న 90 శాతానికి పైగా పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలి. ప్రభుత్వం బ్యాంకులకు విడుదల చేసిన మొత్తాన్ని శనివారం రాత్రిలోగా అధికారులు విత్ డ్రా చేసుకోవాలి. ఏ బ్యాంకులోనైనా డబ్బులు శనివారం రాత్రి కల్లా ఇవ్వలేకుంటే.. అలాంటి బ్యాంకులు ఆదివారం తెరిచి సంబంధిత పింఛన్ల మొత్తాన్ని అందజేయాలి’’ అని బ్యాంకు అధికారులకు సీఎస్‌ నీరభ్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని