Andhra news: పింఛన్ల పంపిణీలో రికార్డు.. ఏపీలో ఒక్క రోజే 95% పూర్తి

ఏపీ చరిత్రలో రికార్డు స్థాయిలో సోమవారం పింఛన్ల పంపిణీ జరిగింది.

Updated : 01 Jul 2024 20:25 IST

అమరావతి: ఏపీ చరిత్రలో రికార్డు స్థాయిలో సోమవారం పింఛన్ల పంపిణీ జరిగింది. ఒకే ఒక్క రోజులో 95శాతం మేర లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం పింఛన్లను పంపిణీ చేసి సరికొత్త ఒరవడిని సృష్టించింది. రాత్రి 7గంటల సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా 61,60,825 మందికి (దాదాపు 94.15శాతం) పింఛన్ల పంపిణీ పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. లబ్ధిదారులకు రూ.4,159 కోట్ల మేర అందజేశారు. 2.65 లక్షల మంది వాలంటీర్లు ఉన్నా గతంలో ఎన్నడూ ఇంత వేగంగా జరగని పింఛన్ల పంపిణీ.. కూటమి ప్రభుత్వం సారథ్యంలో  1.30 లక్షల మంది సచివాలయం ఉద్యోగులతో 12 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో పంపిణీ చేయడం విశేషం. సమర్థ నాయకత్వం ఉంటే అధికారులు, ఉద్యోగులు ఎంత అద్భుతంగా పనిచేస్తారో చెప్పేందుకు ఇదే ఉదాహరణ అంటూ పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. పింఛన్ల పంపిణీలో క్రియాశీలంగా పాల్గొన్న అధికారుల నుంచి గ్రామ/వార్డు సచివాలయం ఉద్యోగుల వరకు అందరికీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని