Muppalla Subbarao: డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసును మళ్లీ విచారించండి: ముప్పాళ్ల సుబ్బారావు

దళిత యువకుడు, డ్రైవర్‌ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసును తిరిగి విచారించాలని ఏపీ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, సీనియర్‌ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 

Updated : 29 Jun 2024 20:11 IST

రాజమహేంద్రవరం: దళిత యువకుడు, డ్రైవర్‌ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసును తిరిగి విచారించాలని, విధి నిర్వహణలో అలసత్వాన్ని ప్రదర్శించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఏపీ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, సీనియర్‌ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సుబ్రహ్మణ్యం హత్య జరిగిన సమయంలో ఎమ్మెల్సీ అనంతబాబు గన్‌మెన్‌ ఎక్కడికి వెళ్లాడని ప్రశ్నించారు. ఈ కేసులో ఇంకా చాలా మంది ఉన్నారని చెప్పారు. వైకాపా అడుగుజాడల్లో నడిచిన పోలీసు అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, పోలీసుశాఖను కోరారు.

సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు సత్యనారాయణ, నూకరత్నం మాట్లాడుతూ.. అనంతబాబు తన కుమారుడిని దారుణంగా హత్య చేశాడని, పోలీసులు కేసును నీరుగార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సహాయం అందలేదన్నారు. ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. అనంతబాబుకు శిక్ష పడేవరకు పోరాడుతామన్నారు. కూటమి ప్రభుత్వంలో తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని