Nara Lokesh: స్కిల్‌ సెన్సస్‌ నిర్వహణ ఏర్పాట్లపై మంత్రి నారా లోకేశ్‌ సమీక్ష

స్కిల్‌ సెన్సెస్‌లో వివిధ శాఖలను భాగస్వామ్యం చేసే విధి విధానాలపై మంత్రి నారా లోకేశ్‌ అధికారులతో చర్చించారు.

Published : 02 Jul 2024 22:42 IST

అమరావతి: స్కిల్‌ సెన్సెస్‌లో వివిధ శాఖలను భాగస్వామ్యం చేసే విధి విధానాలపై మంత్రి నారా లోకేశ్‌ అధికారులతో చర్చించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇంటింటి సర్వే చేపట్టాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. వివిధ రాష్ట్రాల్లోని నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను అధ్యయనం చేయాలని ఆదేశించారు. విదేశాల్లో డిమాండ్‌ ఉన్న కోర్సులతో యువతకు శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. నైపుణ్యాభివృద్ధితో యువతకు ఉపాధి కల్పనకు పెద్దపీట వేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని