Lokesh: పరిశ్రమల ఏర్పాటే లక్ష్యం.. త్వరలో నూతన ఐటీ పాలసీ: మంత్రి లోకేశ్‌

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ కంపెనీలతో పాటు కొత్తగా రావడానికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం పెంచే చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేశ్‌ ఆదేశించారు.

Published : 05 Jul 2024 20:33 IST

అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ కంపెనీలతో పాటు కొత్తగా రావడానికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం పెంచే చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేశ్‌ ఆదేశించారు. ఆ శాఖ అధికారులతో సమావేశమైన లోకేశ్‌ కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై సమీక్షించారు. రాష్ట్రంలో కొత్తగా ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమలను ఆకర్షించడానికి మెరుగైన విధానాలతో నూతన ఐటీ పాలసీని తీసుకురానున్నామని, ఇందుకోసం ఇన్వెస్టర్స్‌ ఫ్రెండ్లీ ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ రంగంలో పెట్టుబడుల పర్యవేక్షణకు గతంలో ఉన్న పోర్టల్‌ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలన్నారు. విశాఖపట్నంలో ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు ఆందుబాటులో ఉన్న ప్లగ్‌ అండ్‌ ఫ్లే ఇన్‌ఫ్రాస్టక్చర్‌పై నివేదిక ఇవ్వాలని అధికారులను కోరారు. విశాఖ, పరిసరాల్లో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపే పరిశ్రమదారులకు ఏ మేరకు భూమి అందుబాటులో ఉందో పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని