Jupalli: తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ అధికారులపై మంత్రి జూపల్లి ఆగ్రహం

తెలంగాణ ఎక్సైజ్‌శాఖ పనితీరుపై మంత్రి జూపల్లి కృష్ణారావు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్‌ అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 18 Jun 2024 22:16 IST

హైదరాబాద్‌: తెలంగాణ ఎక్సైజ్‌శాఖ పనితీరుపై మంత్రి జూపల్లి కృష్ణారావు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్‌ అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన దృష్టికి రాకుండానే పలు నిర్ణయాలు తీసుకోవడం పట్ల మంత్రి అసహనం వ్యక్తం చేశారు. బెవరేజ్‌ కార్పొరేషన్‌ తప్పుడు నిర్ణయాల కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని మండిపడ్డారు. కీలక అధికారులు ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఆదేశించారు. కొందరి సొంత నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలన్నారు. ఏ నిబంధనల ప్రకారం కొత్త నిర్ణయాలు తీసుకున్నారని అధికారులను జూపల్లి ప్రశ్నించారు. విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించిన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని