Chandrababu: ఎయిమ్స్‌లో నీటి సమస్యపై సీఎం చంద్రబాబు విస్మయం

మంగళగిరిలోని ప్రతిష్టాత్మక ఎయిమ్స్ ఆస్పత్రి సమస్యల వలయంలో చిక్కుకుపోవడంపై సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 28 Jun 2024 20:32 IST

అమరావతి: మంగళగిరిలోని ప్రతిష్టాత్మక ఎయిమ్స్ ఆస్పత్రి సమస్యల వలయంలో చిక్కుకుపోవడంపై సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఐదేళ్లుగా కనీసం నీటి సమస్యను కూడా తీర్చకపోవడంపై విస్మయం చెందారు. సాంకేతిక, ఆర్థిక సమస్యలతో ఎయిమ్స్‌కు తాగునీటి సరఫరా చేసే పనులు నిలిచిపోవడం సరికాదన్న సీఎం.. ఈ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని ఎయిమ్స్‌ డైరెక్టర్‌కు హామీ ఇచ్చారు. శుక్రవారం మంగళగిరి ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డా.మధబానందకర్‌ సీఎం చంద్రబాబును కలిశారు. ఎయిమ్స్‌లో నెలకొన్న సమస్యలను ఆయనకు వివరించారు. 

దీనిపై స్పందించిన చంద్రబాబు.. మంగళగిరి ఎయిమ్స్‌ను దేశంలో టాప్ - 3 స్థానంలో ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. గత తెదేపా హయాంలో ఎయిమ్స్‌ ఏర్పాటు చేయగా.. 2019లో వైకాపా ప్రభుత్వం ఏర్పాటయ్యాక సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. నీటి కొరతతో సేవలను విస్తరించలేకపోతున్నామని, ఆ సమస్య పరిష్కారం కోసం తలపెట్టిన పైప్‌లైన్‌ పనులు సైతం ఆగిపోయాయని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. విద్యుత్‌ సరఫరా విషయంలోనూ సమస్య ఉన్నట్లు తెలిపారు. ఎయిమ్స్‌కు మరో పది ఎకరాల స్థలం కేటాయిస్తే విస్తరణ పనులు చేపడతామని సీఎంను కోరారు. ఎయిమ్స్‌లో సౌకర్యాలను ఒకసారి వచ్చి పరిశీలించాలని ఈ సందర్భంగా చంద్రబాబును ఆయన ఆహ్వానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని