phone Tapping case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి కీలకమైన అంశాలతో హైకోర్టులో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.

Updated : 03 Jul 2024 23:54 IST

హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి కీలకమైన అంశాలతో హైకోర్టులో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. కేసు విషయమై పత్రికల్లో వచ్చిన కథనాలతో హైకోర్టు ఈ కేసును సుమోటోగా విచారణకు చేపట్టింది. ట్యాపింగ్‌లో భాగంగా హైకోర్టు జడ్జిలు, రాజకీయ ప్రముఖుల ఫోన్‌లను ట్యాప్‌ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ప్రతిపక్షనేతల కుటుంబ సభ్యుల ఫోన్‌లను కూడా ట్యాప్‌ చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. 

ఈ కేసులో నలుగురు పోలీసు అధికారులను అరెస్టు చేసినట్టు సిట్‌ తెలిపింది. అరెస్టు చేసిన వారి ఇళ్లలో సోదాలు నిర్వహించినట్టు పోలీసులు వివరించారు. ఓ మీడియా సంస్థ యజమాని ఇంట్లో కూడా  సోదాలు చేసి మెటీరియల్‌ సీజ్‌ చేశామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేయగానే ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ దేశం వదిలి వెళ్లిపోయారని విచారణలో భాగంగా పోలీసులు వెల్లడించారు. సోదాల్లో భాగంగా ఎస్‌ఐబీ మాజీ ఓఎస్డీ ఇంట్లో కీలకమైన మెటీరియల్‌ లభ్యమైందని వివరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని