Kanipakam: కాణిపాకంలో వైభవంగా మహా కుంభాభిషేకం

చిత్తూరు జిల్లా శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో మహాకుంభాభిషేకం వైభవంగా జరిగింది.

Updated : 21 Aug 2022 12:28 IST

కాణిపాకం: చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి నూతన ఆలయ మహా కుంభాభిషేకం ఆదివారం ఉదయం వైభవంగా జరిగింది. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తుల నడుమ ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా కుంభాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారి దర్శనం కల్పించారు. 9నెలల తరువాత స్వామి వారి మూలవిరాట్ దర్శనానికి భక్తులు పోటెత్తారు.

ఈ కార్యక్రమానికి ఏపీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, దేవాదాయశాఖ కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌, వేలూరు గోల్డెన్‌ టెంపుల్‌ పీఠాధిపతి నారాయణి అమ్మణ్‌, పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్ బాబు, జిల్లా కలెక్టర్‌ హరినారాయణన్‌, ఎస్పీ రిశాంత్‌ రెడ్డి, ఆలయ పాలక మండలి ఛైర్మన్‌ అగరం మోహన్‌రెడ్డి, ఈవో సురేశ్‌బాబు, ఆలయ నిర్మాణ దాతలు ఐకా రవి, గుత్తికొండ శ్రీనివాస్‌, సమన్వయకర్త రామకృష్ణ ప్రసాద్‌, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని